అప్పట్లో ఆపరేషన్ గరుడ అంటూ బీజేపీ దక్షిణ భారతాన్ని చేతుల్లోకి తెచ్చుకోవడానికి పన్నిన కుట్ర అంటూ ఓ వీడియో పెట్టి సంచలనం సృష్టించిన హీరో శివాజీ.. ఈ సారి జగన్‌పై దాడి, తనపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతలు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ మరో వీడియో విడుదల చేశారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన... ‘‘ ఆపరేషన్ గరుడపై వైసీపీ నేతలు.. గుమ్మడికాయ దొంగల్లా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు’’. ఆపరేషన్ గరుడపై తనకున్న సమాచారం చెప్పానని...వైసీపీ నేతలు ప్రేలాపన అపాలన్నారు..

’’ తాను ఆ రోజు వీడియోలో చెప్పిన ప్రతి అంశాన్ని నిజం చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని మీరే అడిగారు... ఎందుకు పెట్టాలి..? రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలంటున్నారు.. నేను ఎవరికి రుణాలు ఎగ్గొట్టి వెళ్లలేదు.. చంద్రబాబు డబ్బిచ్చి నన్ను అమెరికా పంపారు అంటున్నారు...

ఒకసారి వీసా చెక్ చేసుకోండి... 54 సార్లు అమెరికా వెళ్లొచ్చాను... కేంద్రప్రభుత్వం మీరు ఏది కోరితే అది చేస్తుందిగా ... మీ ఇష్టం వచ్చిన దర్యాప్తు చేయండి అంటూ శివాజీ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. 

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

మేం ఒంటరికాదు...పవన్ మాతోనే: సీపీఎం మధు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్ కి షాక్.. టీడీపీలోకి వైసీపీ సీనియర్..?

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట