విశాఖపట్టణం: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో నెల రోజుల  సీసీటీవీ పుటేజీని సిట్ బృందం సేకరించింది. ఈ సీసీటీవీ పుటేజీ ఆధారంగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు‌ కదలిలకలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అక్టోబర్ 25వ తేదీన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడికి పాల్పడ్డాడు.  ఈ దాడికి పాల్పడిన  ఘటనపై విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఏపీ డీజీపీ ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా  నాగేశ్వరరావు నేతృత్వంలో  సిట్ ఏర్పాటు చేశారు.అయినా విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్ఢా కూడ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.

నెల రోజులుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సీసీటీవీ పుటేజీని పోలీసులు  సేకరించారు.ఈ నెల రోజులుగా  శ్రీనివాసరావు కదలికలపై సీసీటీవీ పుటేజీ ఆధారంగా  పోలీసులు ఆరా తీసయనున్నారు.  ఆరు మాసాలుగా  శ్రీనివాసరావు కదలికలపై కూడ  పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ముమ్మడివరం మండంలంలోని ధనియాపాలెం నుండి కత్తిని   శ్రీనివాసరావు తీసుకొచ్చినట్టుగా  పోలీసులు గుర్తించారు. అయితే  శ్రీనివాసరావు ఎయిర్ పోర్ట్‌లోకి కత్తిని ఎలా తీసుకొచ్చారనే విషయమై కూడ  పోలీసులు ఆరా తీస్తున్నారు.

అత్యంత భద్రత గల ఎయిర్‌పోర్ట్‌లోకి  ఎవరి సహాయంతో  శ్రీనివాసరావును కత్తిని ఎలా తెచ్చారనే విషయమై ఆరా తీస్తున్నారు.శ్రీనివాసరావుకు ఎవరు సహకరించారనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాసరావు ఎవరితో కలిశాడు... ఈ ఘటనకు పాల్పడేందుకు ఎవరి సహకారం తీసుకొన్నాడనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు  శ్రీనివాసరావు ఆర్థిక వ్యవహరాలపై కూడ పోలీసులు కేంద్రీకరించారు. ఒకే సిమ్  వాడినప్పటికి 9 సెల్‌ఫోన్లను శ్రీనివాసరావు మార్చాడు. ఎందుకు తొమ్మిది సెల్‌పోన్లను మార్చాడనే విషయంపై కూడ పోలీసులు  విచారణ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ