అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్  చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పై ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు  కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఈ టర్మ్‌లో పడుతున్న కష్టాలు ఏనాడూ పడలేదన్నారు.

 అమరావతిలో శుక్రవారం నాడు  జరుగుతున్న కలెక్టర్ల కాన్పరెన్స్‌లో  సీఎం చంద్రబాబునాయుడు  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  గురువారం నాడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై జరిగిన  దాడి తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై  పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాబు అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం పన్నెండున్న గంటలకు దాడి జరిగితే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడ స్పందించలేదన్నారు.

తాను పట్టించుకోకపోతే రాష్ట్రంలో గురువారం నాడు శాంతి భద్రతల సమస్య తలెత్తేదే అని ఆయన అభిప్రాయపడ్డారు.  ఈ ఘటన విషయంలో తాను సకాలంలో స్పందించినందున  పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు ఆయన గుర్తు చేశారు.  శాంతి భద్రతల సమస్యలను సాకుగా చూపి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

మీరు విఫలమైతే  నా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని  పోలీసులపై విరుచుకుపడ్డారు.  ముఖ్యంగా ఇంటలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ దాడి తర్వాత సరిగా వ్యవహరించనందు వల్లే విపక్షాలు దుమ్మెత్తిపోశాయని ఆయన చెప్పారు.తాను ఇప్పుడు పడుతున్న కష్టాలను ఎప్పుడూ పడలేదన్నారు.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ