Asianet News TeluguAsianet News Telugu

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  దాడికి పాల్పడిన  శ్రీనివాసరావుకు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసరావు కాల్‌డేటా, సీసీటీవీ పుటేజీని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
 

jagan attack: vizag police conducts enquiry srinivasa rao second day
Author
Vizag, First Published Oct 29, 2018, 12:47 PM IST


విశాఖపట్టణం:  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  దాడికి పాల్పడిన  శ్రీనివాసరావుకు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసరావు కాల్‌డేటా, సీసీటీవీ పుటేజీని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అక్టోబర్ 25వ తేదీన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాసరావు  కత్తితో దాడికి పాల్పడ్డాడు.  ఈ దాడి కేసులో  జ్యూడీషీయల్ రిమాండ్‌లో ఉన్న శ్రీనివాసరావును విశాఖ పోలీసులు ఆదివారం నాడు  తమ కస్టడీలోకి తీసుకొన్నారు. సోమవారం నాడు రెండో రోజు శ్రీనివాసరావును పోలీసులు విచారిస్తున్నారు.

శ్రీనివాసరావు‌ ఒకే సిమ్‌తో 9 సెల్‌ఫోన్లను  ఉపయోగించారు. అయితే అతి తక్కువ కాలంలోనే  9 సెల్‌ఫోన్లను మార్చడం వెనుక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  అంతేకాదు  ఇప్పటికే  శ్రీనివాసరావు ఉపయోగించిన ఫోన్లలో నాలుగు ఫోన్లను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

జగన్‌పై దాడి జరిగిన రోజునే 10 మంది అనుమానితులను విచారించారు. ఈ కేసులో అనుమానితుల విచారణ కొనసాగుతూనే ఉంటుందని  పోలీసులు ప్రకటించారు. అయితే రెండు రోజుల్లో ఈ ఘటనకు సంబంధించి  పూర్తి వివరాలను  వెల్లడించనున్నట్టు  పోలీసులు చెబుతున్నారు.

శ్రీనివాసరావుకు ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంకు, విజయా బ్యాంకుల్లో  మూడు ఖాతాలున్నాయని  పోలీసులు గుర్తించారు.  ఈ ఖాతాల్లో  డబ్బులు ఎవరెవరి నుండి శ్రీనివాసరావుకు వచ్చాయి.. పెద్ద మొత్తంలో  డబ్బులు వచ్చాయా.... ఎలా వచ్చాయనే విషయమై కూడ  పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సీసీటీవీ పుటేజీని  పోలీసలుు స్వాధీనం చేసుకొన్నారు.  నెల రోజులకు పైగా సీసీటీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొని  ఈ పుటేజీపై  నిపుణులతో విశ్లేషిస్తున్నారు.  అంతేకాదు  శ్రీనివాసరావు ఉపయోగించిన సెల్‌ఫోన్లలో  ఇప్పటికే నాలుగింటిని కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ ఫోన్లలో  ఉన్న  సమాచారాన్ని కూడ సేకరించేందుకు  నిపుణులు  ప్రయత్నిస్తున్నారు.

శ్రీనివాసరావు  కిచెన్ రూమ్‌లో విధులు నిర్వహించాల్సి ఉండగా... ఎందుకు సర్వీస్ బోయ్‌గా మారాడనే విషయమై కూడ ఆరా తీస్తున్నారు. నాలుగు బృందాలుగా పోలీసులు  ముమ్మడివరం మండలంలో  విచారణ చేస్తున్నారు. రెండో రోజున  శ్రీనివాసరావుకు లేఖ రాసిన  రేవతిపతి, విజయటక్ష్మీలను సోమవారం నాడు  విచారణ చేస్తున్నారు.

శ్రీనివాసరావు ఉపయోగించిన సెల్‌ఫోన్ వినియోగంపై  కాల్ డేటాను విశ్లేషించేందుకు  పోలీసు అధికారి ఫకీరప్ప సహయం తీసుకొంటున్నారు.ఈ కేసు దర్యాప్తులో  ఫకీరప్ఫ కూడ భాగస్వామ్యిగా ఉన్నారు. కాల్‌డేటాను విశ్లేషించి అనేక కేసులను  పరిష్కరించిన రికార్డు ఫకీరప్పకు ఉంది.దీంతో ఈ కేసులో ఐటీ నిపుణులతో పాటు ఫకీరప్ఫ కూడ శ్రీనివాపరావు కాల్ డేటాను  విశ్లేషిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

 

Follow Us:
Download App:
  • android
  • ios