వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పేరును మంత్రి లోకేష్ మార్చేశారు. జగన్ మోదీ రెడ్డిగా పేర్కొన్నారు.  ఇంతకీ మ్యాటరేంటంటే.. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో ఆయన స్టేట్మెంట్ కోసం వెళ్లిన ఏపీ పోలీసులను జగన్ కించపరిచారు. ఏపీ పోలీసులను తాను నమ్మనని పేర్కొన్నారు. కాగా.. దీనిపై లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఏ1 ముద్దాయి ‘జగన్ మోదీ రెడ్డి’.. దొంగ, దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, ఛానల్‌లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు. కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తా అని పోలీసులకు బెదిరింపులు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేదు అంటూ ప్రజలను కించపరిచే విధంగా ‘జగన్ మోదీ రెడ్డి’ మాట్లాడటం దారుణం’ అంటూ #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్‌ జత చేశారు.

విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇది జగన్‌ ఆడిన నాటకమని లోకేశ్‌ శుక్రవారం అభిప్రాయపడ్డారు. వైసీపీ కోడి కత్తి డ్రామా ఆడుతోందని అన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ‘జగన్ మోదీ రెడ్డి’కి కొత్త కాదన్నారు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కొత్త నాటకానికి తెరలేపారని పేర్కొన్నారు. దాడి వెనుక ఉన్న వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైందని చెప్పారు.

more news

జగన్ పై దాడి: శ్రీనివాస్ అందులో ఆరితేరినవాడు

హైదరాబాదులో జగన్ కు చికిత్స: చంద్రబాబు యూటర్న్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్