హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు చిన్నమెదడు చితికినట్లు ఉందని అందుకే ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముఖంలో క్రూరత్వం కనిపిస్తోందని బొత్స విమర్శించారు. 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే  సీఎంగా చంద్రబాబు స‍్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దాడిని ఖండిచకుండా డ్రామా అని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. 

ఏదైనా ఘటన జరిగితే మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి స్పందిస్తారు...అలాంటిది రాష్ట్ర సీఎంగా ఉన్న చంద‍్రబాబు మాత్రం అదొక డ్రామా అంటూ మాట్లాడటం ఆయనలో క్రూరత్వాన్ని తెలియజేస్తోందని విమర్శించారు.

వైఎస్‌ జగన్‌ను రాజకీయ పార్టీలు పరామర్శించడం తప్పు అనేలా బాబు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబుది నోరా తాటిమట్టా అంటూ ధ్వజమెత్తారు.  ఎవరైనా గాయమైతే ఆస్పత్రికి వెళ్తారా లేక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. 

నిందితుడు వద్ద 11 పేజీల లేఖ ఎలా వచ్చిందో చెప్పాలంటూ బొత్స డిమాండ్‌ చేశారు. చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారడానికి ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలే నిదర్శనమన్నారు. ఏపీలో ఒక ఎమ్మెల్యే హత్యకు గురైనప్పుడే మీ పాలన ఎలా ఉందో అందరికీ తెలిసిందన్నారు. ఏపీలో శాంతి భద్రతలు అనేవి అసలు లేవని బొత్స విమర్శించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ పోలీసులకు జగన్ షాక్: తెలంగాణ పోలీసులైతే ఓకే

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ