ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సిపి అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. గత వారం రోజులుగా అతన్ని సిట్ బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే.  అయితే కోర్టు విధించిన ఆరు రోజుల కస్టడీ గడువు ఇవాళ ముగియడంతో పోలీసులు కోర్టుకు తరలించారు.

మొదట శ్రీనివాస్ రావుకు ఎయిర్ పోర్టు పీఎస్‌లోనే డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడి ఆరోగ్యం మెరుగ్గానే ఉండటంతో కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద ఎలాంటి అలజడి, గందరగోళం లేకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. 

అయితే కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ పొడిగించింది. దీంతో అతన్ని పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. విశాఖ పట్నంలోని సెంట్రల్ జైలుకు అతన్ని తరలించారు. 

ఈ  కేసులో శ్రీనివాస్ ను ఇంకా విచారించాలని సిట్ భావిస్తోంది. అందుకోసం అతన్ని మరోసారి కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరనున్నారు. ఇందుకోసం కోర్టులో దాఖలు చేయడానికి సిట్ మరో పిటిషన్ ను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు చదవండి

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ