హైదరాబాద్: సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నా కూడ మంత్రి పదవి దక్కని కీలక నేతలు ఈ సారైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిలో ఇద్దరు నేతలు గతంలో టీడీపీలో కీలకంగా పనిచేశారు. ఒకరు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరోకరు టీఆర్ఎస్ లో ఉన్నారు.ఈ నలుగురు కూడ ప్రస్తుతం టీఆర్ఎస్ గూటికి చేరారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్  మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. 1994 నుండి ఇప్పటివరకు ఆరు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ దఫా మినహా మిగిలిన అన్ని దఫాలు ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత దయాకర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

ఈ దఫా పాలకుర్తి నుండి మరోసారి విజయం పోటీ చేసి దయాకర్ రావు భారీ మెజారిటీతో విజయం సాధించారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సామాజిక సమీకరణాల వల్ల దయాకర్ రావుకు మంత్రి పదవి దక్కలేదు.

వరంగల్ జిల్లా నుండి కడియం శ్రీహరికి చంద్రబాబునాయుడు కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. రేవూరి ప్రకాష్ రెడ్డికి మంత్రి పదవిని ఇవ్వాలని భావించినా దయాకర్ రావు ఒత్తిడితో రేవూరికి కేబినెట్ బెర్త్ దక్కలేదు. దయాకర్ రావుకు కూడ మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికలకు ముందు కడియం శ్రీహారి టీఆర్ఎస్ లో చేరి తొలుత ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య భర్తరప్ కారణంగా కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరారు. ఈ దఫా కేసీఆర్ కేబినెట్ లో స్థానం దక్కుతోందనే ఆశాభావంతో ఉన్నారు.ఈ దఫా జూపల్లి కృష్ణారావు ఓటమి పాలు కావవడంతో దయాకర్ రావుకు కేబినెట్లో స్థానం దక్కుతోందని విశ్వాసంగా ఉన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో టీడీపీలో తిరుగులేని నేతగా పేరొందిన సుఖేందర్ రెడ్డి ఇంతవరకు మంత్రి పదవిని నిర్వహించలేదు. 1999లో నల్గొండ ఎంపీగా సుఖేందర్ రెడ్డి తొలిసారిగా విజయం సాధించారు. అంతకుముందు ఆయన నార్ముల్ ఛైర్మెన్, ఏపీ పాల ఉత్పత్తిదారుల ఫెడరేషన్ ఛైర్మెన్ గా ఉండేవారు.2009 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఆ ఎన్నికల్లో మరోసారి ఆయన ఎంపీగా విజయం సాధించారు. 2014 లో కూడ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా మరోసారి విజయం సాధించారు. ఏడాదిన్నర క్రితం సుఖేందర్ రెడ్డి  టీఆర్ఎస్ లో చేరారు.  ఆ తర్వాత కేసీఆర్ ఆయనకు రైతు సమన్వయ సమితి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు. దీనికి కేబినెట్ ర్యాంకు హోదాను కల్పించారు.

మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఈ స్థానం నుండి గెలిపించి కేబినెట్లో  కేసీఆర్ చోటు కల్పిస్తారని ప్రచారం సాగుతోంది.


ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేసిన కెఆర్ సురేష్ రెడ్డికి ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు. 1989 నుండి 2004 వరకు నాలుగు దఫాలు విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో సురేష్ రెడ్డి ఓటమి పాలయ్యారు. రెండు మాసాల క్రితం సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.సురేష్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్  హామీ ఇచ్చారు.

2004 నుండి ఇప్పటివరకు వరుసగా విజయం సాధిస్తున్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల ప్రచార సమయంలో ఈశ్వర్ కు మంత్రి పదవిని ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ, ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కలేదు.  దీంతో గత టర్మ్‌లో విప్ పదవిని కే్సీఆర్ ఇచ్చారు. ఈ దఫా ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కుతోందనే ఆశతో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి ఓటమి: మిగిలింది గుర్నాథ్‌రెడ్డికి కేసీఆర్ హామీనే

రేవంత్ రెడ్డి‌పై ఓవైసీ, కేసీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

రేవంత్‌రెడ్డికి చెక్: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు

రేవంత్‌కు కొడంగల్ దెబ్బ: కేసీఆర్ పంతం, హరీష్ వ్యూహం

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లెలా ఉన్నాయి: రేవంత్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్