హైదరాబాద్:  తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి చెందిన గోపన్‌పల్లి భూమిలో గోడను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారంనాడు జేసీబీలతో కూల్చివేశారు. రేవంతో సోదరుడు కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

గోపన్ పల్లిలోని రేవంత్ రెడ్డికి చెందిన భూమిలో ఉన్న గోడను గుర్తు తెలియని వ్యక్తులు  కూల్చేశారు. ఈ గోడను కూల్చేసిన వారు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గోపన్‌పల్లిలో భూమిలో గోడను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారని తెలుసుకొన్న రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గోడను కూల్చివేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. ఎందుకు ఈ గోడను కూల్చివేశారనే విషయమై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.