జడ్చర్ల:  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మంగళవారం సాయంత్రం భారీ భద్రత మధ్య  పోలీసులు కొడంగల్‌కు తరలించారు. సీఈసీ ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్ రెడ్డిని  కొద్దిసేపటి క్రితమే  పోలీసులు కొడంగల్‌కు తరలించారు.

మంగళవారం నాడు తెల్లవారుజామున ఉదయం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆయన ఇంట్లో పోలీసులు ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. కొడంగల్ నుండి రేవంత్‌ను జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.

 రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయమై కాంగ్రెస్ పార్టీ  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను  దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయమై  హైకోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏ ఆధారాలతో  పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డిని  అరెస్ట్ చేసినట్టు హైకోర్టుకు పోలీసులు వివరణ ఇచ్చారు.

ఇంటలిజెన్స్ నివేదికను కూడ అందించాలని హైకోర్టు ఆదేశించింది. రేవంత్ ఆచూకీ తెలపాలని కోర్టు వికారాబాద్ ఎస్పీని ఆదేశించింది. దీంతో కేసు విచారణను రెండు దఫాలు వాయిదా పడింది.

ఈ లోపుగా కాంగ్రెస్ పార్టీ నేతల వినతి మేరకు సీఈసీ రజత్ కుమార్  రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని  ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డిని  జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి  కొడంగల్  భారీ బందోబస్తుతో  పోలీసులు  తరలించారు.

సంబంధిత వార్తలు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

.