హైదరాబాద్: తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు  రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  చెప్పారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా  ఓటు హక్కును కలిగి ఉన్న కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసే వారి ఓట్లను బూత్‌స్థాయి నుండి ప్రభుత్వం పకడ్బందీగా తొలగించిందని ఆయన ఆరోపించారు.

సుమారు అర్హులైన 20 లక్షల ఓటర్లను  తొలగించారని  రేవంత్ రెడ్డి  చెప్పారు. ఈ ఓటర్లను  తొలగించిన  విషయమై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు  తీసుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్‌‌కు  రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎర్రవెల్లి గ్రామంలో కేసీఆర్ కు ఓటు హక్కు ఉందన్నారు. మరో వైపు  కేసీఆర్ స్వంత గ్రామమైన చింతమడకలో  కూడ ఓటు  హక్కు ఉందని చెప్పారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉండడం ఎన్నికల నిబంధనల ప్రకారంగా  రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమని ఆయన చెప్పారు.

ఎన్నికల అధికారులకు కేటీఆర్ అభినందనలు చెప్పడాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణలో  అక్కడక్కడ పొరపాట్లు చోటుచేసుకొన్నందుకు గాను క్షమాపణలను ఎన్నికల అధికారులు కోరిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ఓట్ల గల్లంతుపైనా పదేపదే  ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు.

తన తండ్రికి రెండు చోట్ల ఓటు హక్కు కల్పించినందుకు కేటీఆర్ ఎన్నికల అధికారులను అభినందించారా అని ఆయన ప్రశ్నించారు. రెండు చోట్ల ఓటు హక్కు కల్పించిన అధధికారులకు  చర్యలు తీసుకోవాలని  ఆయన డిమాండ్ చేశారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్