కొడంగల్: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సభను పురస్కరించుకొని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ముందు జాగ్రత్తగా పోలీసులు మంగళవారం నాడు ఉదయం అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు రేవంత్ రెడ్డిని తరలించారు.

కొడంగల్ లో సీఎం సభ సందర్భంగా రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు. దీంతో కోస్గి, కొడంగల్ లలో 144 సెక్షన్ అమలు చేశారు.రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఈసీ ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్‌ పోలీసు స్టేషన్‌లో రేవంత్‌పై కేసు నమోదు చేసినట్లు అదనపు డీజీపీ జితేందర్‌ తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున రేవంత్ రెడ్డిని పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు