హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో  టీఆర్ఎస్ అభ్యర్థిగా  బరిలో ఉన్న కేసీఆర్ విజయం అంత సలభం కాదని లగడపాటి రాజగోపాల్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని  గజ్వేల్‌ నియోజకవర్గంలో  విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ల‌ు తనకు చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

బుధవారం నాడు హైద్రాబాద్‌లో  లగడపాటి రాజగోపాల్  మీడియాతో మాట్లాడారు.  అక్టోబర్ 28వ తేదీన తాను గజ్వేల్‌ వెళ్లున్న సమయంలో వాహనాల తనిఖీలో భాగంగా కొందరు పోలీసులు తన వాహానాన్ని  తనిఖీలు చేశారని ఆయన చెప్పారు.

ఈ సమయంలో  తనను కారు నుండి దింపేశారని ఆయన చెప్పారు. తనిఖీలు చేస్తున్న సమయంలో  ఓ కానిస్టేబుల్ తనను గుర్తుపట్టి రాష్ట్రంలో ఏ పార్టీ  అధికారంలోకి వస్తోందనే విషయాన్ని అడిగారని  ఆయన గుర్తు చేసుకొన్నారు.

అయితే  ఎన్నికల ఫలితాలకు ఇంకా సమయం ఉందన్నారు.ఇప్పుడే  చెప్పడం కుదరదన్నారు. అయితే  గజ్వేల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి తాను కానిస్టేబుళ్లను ప్రశ్నించినట్టు ఆయన ప్రస్తావించారు.

అయితే  ఆ సమయంలో  అతను ఓడిపోతాడని  కానిస్టేబుళ్లు తనకు చెప్పారని  లగడపాటి రాజగోపాల్ గుర్తు చేశారు.అయితే ఓడిపోయే అభ్యర్థి పేరు చెప్పడం భావ్యం కాదన్నారు. ఇప్పుడే ఆ పేరును తాను వెల్లడించబోనని ఆయన చెప్పారు. అయితే ఆ అభ్యర్థి ఎవరో మీరు విశ్లేషించుకోవచ్చన్నారు.  

తన కారును  తనిఖీ చేసిన సమయంలో  విధుల్లో ఎస్ఐ ప్రతాప్ ఉన్నారని, ఆయనతో పాటు ఏడుగురు కానిస్టేబుళ్లు ఆ రోజు విధులు నిర్వహించారని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల