హైదరాబాద్: రేవంత్ రెడ్డిని  వెంటనే విడుదల చేయాలని సీఈసీ రజత్ కుమార్ ఆదేశించారు. 

కొడంగల్‌లో  మంగళవారం నాడు  సీఎం కేసీఆర్ సభ ఉన్నందున ముందుజాగ్రత్తగా ఇవాళ తెల్లవారుజామున  కేసీఆర్‌ను  పోలీసులు అరెస్ట్ చేశారు.కేసీఆర్‌ సభకు వ్యతిరేకంగా  నిరసన ప్రదర్శనలు చేయాలని  రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన  నేపథ్యంలో  ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్  విషయమై కాంగ్రెస్ పార్టీ  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌‌పై హైకోర్టు   విచారించింది. ఈ విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని  హైకోర్టు ప్రశ్నించింది.

రేవంత్  అరెస్ట్ వ్యవహరంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది.  వెంటనే  రేవంత్ ఆచూకీని తెలపాలని వికారాబాద్ ఎస్పీకి కూడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాలు వెలువడిన క్షణాల్లోనే  రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని సీఈసీ రజత్‌కుమార్ డీజీపీని ఆదేశించారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ కొడంగల్ లో సీఎం సభ ఎలా నిర్వహిస్తారని  కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టులో కూడ తమ వాదనను విన్పించనున్నట్టు వారు ప్రకటించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌ గా రేవంత్ రెడ్డి ఉన్నందున ఆయనను  విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు  సీఈసీ రజత్‌కుమార్ కు మంగళవారం మధ్యాహ్నం వినతిపత్రం సమర్పించారు. రేవంత్ రెడ్డి ప్రచారం కోసం హెలికాప్టర్ కూడ సిద్దంగా ఉందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. 

ఈ విషయమై డీజీపీకి సీఈసీ రజత్‌కుమార్ ఓ లేఖ రాశారు. రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ విషయమై డీజీపీతో కూడ  రజత్ కుమార్ ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం.


సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్