టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్‌‌‌ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున రేవంత్‌ను అరెస్ట్ చేశారని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు భారీగా ఆయన నివాసానికి తరలివచ్చారు.

అప్పటికే రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో వారిని అడ్డుకున్నారు. కొడంగల్ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అధికార టీఆర్ఎస్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అన్ని మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు బొమ్మరాన్‌పేట మండలంలో 9 మంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య

"