హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలను టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు బనాయించడం ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు.

శుక్రవారం నాడు పోలింగ్ అనంతరం విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్  మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

ఈ రెండు ఘటనలు ఓటర్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయన్నారు. ఈ నెల 4వ తేదీన  రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం  కూడ ఓటర్లపై  తీవ్రమైన ప్రభావం చూపిందన్నారు.

ఈ పరిణామాలు అధికార పార్టీకి కొంత నష్టం చేసే విధంగా ఉన్నాయని లగడపాటి రాజగోపాల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన కోస్గిలో కేసీఆర్  సభ సందర్భంగా  రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై  హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడ పోలీసుల తీరును తప్పుబట్టింది.

సంబంధిత  వార్తలుః

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల