హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  ఆచూకీ తెలపాలని హైకోర్టు వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఆదేశాలు జారీ చేసింది.రేవంత్ రెడ్డి అరెస్ట్ పై హైకోర్టు పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొడంగల్ సభ ఉన్నందున ముందు జాగ్రత్తగా  రేవంత్ రెడ్డిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై  హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేసింది


ఈ పిటిషన్‌ను ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు విచారణకు స్వీకరించింది.  రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని  హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. అల్లర్లు జరగవచ్చనే ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డిని ముందుగా అదుపులోకి తీసుకొన్నామని పోలీసులు హైకోర్టు వివరించారు. ఇంటలిజెన్స్ నివేదిక కాపీని తమకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

 ఏ ఆధారాలతో రేవంత్ రెడ్డిని  అరెస్ట్ చేశారని  హైకోర్టు ప్రశ్నించింది. రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో చెప్పాలని హైకోర్టు  కోరింది. రేవంత్ ఆచూకీపై స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను హైకోర్టు ఆదేశించింది.  వికారాబాద్ ఎస్పీ నివేదిక కోసం హైకోర్టు విచారణను  15 నిమిషాల పాటు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

రేవంత్ ఆచూకీ కోసం గీత ఏం చేసిందంటే

రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ భారీ కుట్ర: గీత (ఆడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

144 సెక్షన్ ఉన్నప్పుడు.. కేసీఆర్ సభ ఎలా పెడతారు: జంధ్యాల

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్