రేవంత్ అరెస్ట్‌పై ఆయన భార్య గత మండిపడ్డారు... అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటంటూ ఆమె పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని, టెర్రరిస్టును లాక్కెళ్లినట్లు ఈడ్చుకెళ్లారని గీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన భర్తకు ప్రాణహానీ ఉందని...పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తమ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, అభిమానులు సంయమనం కోల్పోవద్దని గీత పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు

"