హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై  ఆ పార్టీ నేతలు  మంగళవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.

కొడంగల్ లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  ఎన్నికల  సభ మంగళవారం నాడు ఉన్న నేపథ్యంలో  రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు. దీంతో రేవంత్ రెడ్డిని పోలీసులు మంగళవారం నాడు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.

కొడంగల్ నియోజకవర్గంలో  ఇవాళ కేసీఆర్ సభ నేపథ్యంలో నిరసన ప్రదర్శనలకు  కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అంతేకాదు  కేసీఆర్ పై రేవంత్ రెడ్డి  తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో  ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసీఆర్ సభను పురస్కరించుకొని ముందస్తుగా రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ అరెస్ట్ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు  ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.  ఇవాళ మధ్యాహ్నం  ఈ పిటిషన్‌పై  హైకోర్టు  విచారణ చేయనుంది.రేవంత్ రెడ్డి విషయమై కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌పై మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరగనుంది.

ఈ విషయమై  పోలీసులు కూడ హైకోర్టులో  తమ వివరణను  కూడ ఇవ్వనున్నారు.పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో రేవంత్ రెడ్డిని  ఉంచినట్టు  ఎస్పీఅన్నపూర్ణ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.ఈ విషయాలను  హైకోర్టులో పోలీసులు వివరించే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు