హైదరాబాద్: తాను ఎవరి ఒత్తిడితోనో సర్వే వివరాలను మార్చలేదని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు.

బుధవారం నాడు  ఉదయం  విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 15 లేదా 16వ తేదీన కేటీఆర్ తనను కలుసుకొన్నారని రాజగోపాల్ చెప్పారు. తాను నిర్వహించిన సర్వే వివరాలను కేటీఆర్ తెలుసుకొన్నారని ఆయన వివరించారు.

టీఆర్ఎస్‌కు అనుకూలంగా తెలంగాణలో ఫలితం ఉందని తాను ఏనాడు చెప్పలేదన్నారు. వీలుంటే  ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చాలని కూడ  తాను కేటీఆర్‌కు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తాను ఎవరి ప్రోద్భలంతోనో సర్వే రిపోర్టులు  మార్చలేదన్నారు. కేటీఆర్  23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి గురించి సర్వే వివరాలను కావాలని  అడిగారు.  అయితే ఈ 23 స్థానాలతో పాటు మరికొన్ని స్థానాల సమాచారాన్ని కూడ కేటీఆర్‌కు పంపినట్టు చెప్పారు.

నపంబర్ 11వ తేదీన 37 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు  విజయం సాధిస్తారని తాను కేటీఆర్ కు సమాచారాన్ని  ఇచ్చినట్టు చెప్పారు.టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ‌లు విడి విడిగా పోటీ చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది, కలిసి పోటీ చేస్తే  పరిస్థితి మారిపోయే అవకాశం ఉంటుందన్నారు. ఓటు ట్రాన్స్‌ఫర్‌పై కూడ  తమ మధ్య చర్చ జరిగిందన్నారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అరెస్ట్‌లు  వద్దని  కూడ కేటీఆర్‌కు తాను సూచించిన విషయాన్ని  రాజగోపాల్  వివరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఉందని తాను కేటీఆర్‌కు వివరించిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులపై కూటమి వైపుకు ఓటు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉందని కూడ తాను  చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

నవంబర్ 20వ తేదీన తర్వాత వచ్చిన సర్వే నివేదికలను తమ మధ్య షేర్ చేసుకోలేదన్నారు. ప్రజా కూటమిలో సీట్ల గందరగోళం ఉన్న సమయంలో కూడ సర్వే నివేదికలను  కూడ  కేటీఆర్ కు పంపినట్టు ఆయన గుర్తు చేశారు.

తాను ఎవరికి భయపడలేదన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడ తాను భయపడలేదన్నారు. ప్రజల నాడిని  పసిగట్టే  స్వభావం ఉన్నందునే  సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

తనకు కేటీఆర్‌కు ఎప్పుడూ గొడవ లేదన్నారు. కేటీఆర్ ను తాను ఎప్పుడూ కలవలేదన్నారు.  కానీ, ఈ ఏడాది సెప్టెంబర్ 15 లేదా 16 తేదీల్లో  కేటీఆర్‌తో తమ సమీప బంధువు ఇంట్లో కేటీఆర్‌ను  కలిసినట్టు చెప్పారు.

తనపై  తప్పుడు ప్రచారం చేయడం వల్ల మనసుకు బాధ కలగడంతోనే  తాను  మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. నేను చెప్పిన  విషయాలు ప్రభావం చూపుతోందా లేదా అనేది  నాకు సంబంధం లేదన్నారు. ఎవరు గెలిచినా ఓడినా తనకు వచ్చిన లాభం లేదు, నష్టం లేదన్నారు.

ఇంకా  24 గంటల సమయం ఉంది..  ఎన్నికల ఫలితాలను ఎటైనా మార్చుకోవచ్చన్నారు. తన సర్వే ఫలితాలను  ఓ మీడియా సంస్థ లోతుగా ప్రచురించిన  సమయంలో   తాను కేటీఆర్‌తో కుమ్మక్కైనట్టుగా ఎవరూ కూడ ఎందుకు మాట్లాడలేదన్నారు.

నా మిత్రుడికి చెప్పినట్టుగానే కేటీఆర్‌కు  సర్వే ఫలితాలను వివరించారు.ఈ సర్వే ఫలితాలకు సంబంధించి వివరాలను లోతుగా విశ్లేషించినట్టు రాజగోపాల్ వివరించారు.

నిజాలు చేదుగా ఉంటాయని వాస్తవాలను జీర్ణించుకోవడంలోనే  నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు.  తాజా సర్వే ప్రకారంగా వరంగల్‌ జిల్లాలో కూడ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని ఆయన చెప్పారు.   ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణంలో ఉంటుందన్నారు. తాను తెలంగాణ వ్యతిరేకినైతే   కేటీఆర్‌కు ఎందుకు సర్వే చేసి పెడతానని లగడపాటి రాజగోపాల్ ప్రశ్నించారు.

రాజకీయ అనుభవంతో తాను కేటీఆర్‌కు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు  ఆయన గుర్తుచేశారు.ఎన్నికల సమయంలో  అరెస్ట్‌లు వద్దని కూడ తాను  కేటీఆర్‌కు చెప్పానని చెప్పారు. రాష్ట్రంలోని 65 మంది అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని విషయాన్ని  కేటీఆర్‌కు చెప్పిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.

మైనార్టీల్లో కూడ వేగంగా మార్పులు వస్తున్నాయని చెప్పారు. నవంబర్ 20 తర్వాత కేటీఆర్‌కు తనకు మధ్య ఎలాంటి సంభాషణలు రాలేదన్నారు.కేటీఆర్ పోస్ట్ చేసినట్టుగా చెబుతున్న వాట్సాప్ సంభాషణకు తనకు సంబంధం లేదన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని చెప్పారు. సర్వేలు చేయడం తన వ్యాపకమని చెప్పారు. అక్టోబర్ 28వ తేదీన గజ్వేల్ లో కారును ఆపారని చెప్పారు.

తనను గుర్తు పట్టి కొందరు  కానిసేబుళ్లు తనతో సర్వే ఫలితాల గురించి అడిగారని చెప్పారు. గజ్వేల్ లో పోతారు సార్ అని ఏడుగురు కానిస్టేబుళ్లు తనకు చెప్పారన్నారు. అయితే ఎవరు ఓడిపోతారో అనే విషయాన్ని తాను ఇప్పుడు చెప్పడం బాగుండదన్నారు.  ఆ రోజు ఎస్ఐ ప్రతాప్‌తో పాటు ఏడుగురు కానిస్టేబుళ్లు తనతో  ఫోటోలు దిగి ఈ విషయాన్ని తనతో షేర్ చేసుకొన్నారని చెప్పారు.

. భావోద్వేగాలను రెచ్చగొడితే ఉపయోగం లేదన్నారు. ఈ ఎన్నికల్లో వాటి ప్రభావం అంతగా చూపే అవకాశం లేదని ఆయన వివరించారు. డిసెంబర్ 7వ తేదీలోపుగా తాను  ఎన్నికల ఫలితాలను ప్రకటించలేదన్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు  మెజారిటీ వస్తోందని  తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరు విజయం సాధిస్తారో తాను ప్రకటించలేదన్నారు.

తాను చెప్పిన విషయాలన్నీ శిలా శాసనాలు కావన్నారు. తన సర్వేలను  నమ్మే వాళ్లున్నారు... నమ్మని వాళ్లు కూడ ఉన్నారని  ఆయన చెప్పారు. అమెరికా వెళ్లిపోతానంటూ  కేటీఆర్ ‌తనతో  చాట్ చేయలేదన్నారు. కేసీఆర్‌ కారణంగా జరిగిన నష్టాన్ని కేటీఆర్ పూడుస్తున్నారని తాను గుర్తు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

 

సంబంధిత వార్తలు

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల