కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని  ఈ రోజు ఉదయం కొడంగల్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత, గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి సీరియస్ అయ్యారు.  రేవంత్ రెడ్డి అరెస్టును తాను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.

టీఆర్ఎస్ అధికారంలో రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా  అని ప్రశ్నించారు.అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన అన్నారు. కళ్లకు పొరలు వచ్చి కండకావరంతో మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ డబ్బు మదంతో గూండాయిజం చేస్తున్నారని వంటేరు వ్యాఖ్యానించారు.

ఈ రోజు కొండగల్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి అడ్డుకుంటారేమోననే కారణంతో ఆయనను అరెస్టు చేశారు. దీంతో కొడంగల్ లో హైటెన్షన్ నెలకొంది.