సినిమాలు మనిషి జీవితంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపిస్తాయి. సినిమాల వల్ల బాగుపడిన వారు కొందరైతే.. జీవితాలను పొగొట్టుకున్న వారు ఇంకొందరు. తాజాగా హత్యకు పాల్పడి... ఓ సినిమాలో హత్యను కవర్ చేయడానికి హీరో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసి ఇద్దరు అన్నదమ్ములు అడ్డంగా దొరికిపోయారు.

 వివరాల్లోకి వెళితే...ప్రకాశం జిల్లాకు చెందిన మలినేని నాగేశ్వరరావు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి నగరంలోని బీఎన్ రెడ్డి నగర్‌లో ఓ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అల్మాసగూడ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి నంబూరి ప్రసాద్‌రావు ప్రతిరోజు నాగేశ్వరరావు షాపులో పాలు కొనుక్కుని వెళ్లేవాడు.

ఈ నేపథ్యంలో అతనికి నాగేశ్వరరావు భార్యతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చనువుగా ఉండటం గమనించిన నాగేశ్వరరావు తన భార్యను హెచ్చరించగా... కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉండటాన్ని గమనించాడు. దీనిని తట్టుకోలేని నాగేశ్వరరావు .. వృద్ధుడిని అంతమొందించాలని కుట్రపన్నాడు.

ప్రతిరోజూ లాగే మిల్క్ సెంటర్ వద్దకు వెళ్లి కబుర్లు చెప్పే నాగేశ్వరరావు అక్కడికి వెళ్లి నాగేశ్వరరావు, అతని తమ్ముడు నాగులపాటి ప్రసాదరావుతో మాట కలిపారు. మద్యం తాగాలని బీర్లు తెప్పించారు...ప్రసాదరావు తాగనని చెప్పి సోడా తాగుతున్నాడు.

ఈ క్రమంలో వివాహేతర సంబంధం చర్చకు రావడంతో.. వారిద్దరి మధ్య చర్చకు వచ్చింది.. దీంతో మాటా మాటా పెరిగి మద్యం మత్తులో అన్నదమ్ములు వృద్ధుడిని గొంతు నులిమి చంపారు. అయితే అందరిని నమ్మించడానికి వెంకటేశ్, మీనా నటించిన ‘‘దృశ్యం’’ సినిమాలో హత్యను కవర్ చేయడానికి హీరో ఆడిన నాటకాన్ని ఇక్కడే అమలు చేయాలని భావించాడు.

ఎవరు ఏం అడిగినా ఇద్దరు ఒకటే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు భర్త ప్రసాదరావు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య మేరీ లీలా, నాగేశ్వరరావుకు ఫోన్ చేయగా సాయంత్రమే వెళ్లిపోయాడని చెప్పాడు.

ప్లాన్ ప్రకారాం 27వ తేదీ రాత్రి అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ప్రసాదరావు మృతదేహాన్ని మరో షాపు ఎదుట పడేశారు. పోలీసులను పక్కదారి పట్టించడానికి ప్రసాదరావు మెడలోని 16 గ్రాముల బంగారు గొలుసు, చేతి ఉంగరం, నగదు తీసుకుని వేర చోట దాచిపెట్టారు.

అతడి సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఒక బట్టలో మూటగట్టి వనస్థలిపురం మెయిన్‌రోడ్డుకు వెళ్లి డీసీఎంలో పడేశారు. ఆ మరుసటి రోజు ఏమీ తెలియనట్లుగా మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి.. ప్రసాదరావు తమ పక్కషాపు ముందు అనుమానాస్పదంగా పడివున్నాడని చెప్పాడు.

పోలీసులకు సాయం చేస్తూనే మృతుడి భార్యను ఓదార్చుతున్నట్లు నాటకమాడారు. విచారణలో భాగంగా పోలీసులు నాగేశ్వరరావును విచారణ చేయగా...ఉదయాన్నే షాపు వద్దకు వచ్చేసరికి పక్క దుకాణం ముందు ప్రసాదరావు మృతదేహం ఉంది.. నాకంటే ముందు పాల ఆటో వచ్చింది. ఆ తర్వాతే తాను వచ్చానని... మృతదేహాన్ని ఇక్కడ ఎవరు పడేశారో తనకు తెలియదని తెలిపాడు.

సాయంత్రం 6 గంటలకు తన షాపు వద్దకు ప్రసాదరావు వచ్చాడు.. ఆ సమయంలో తాను తన తమ్ముడు ఉన్నామని.. సుమారు 6.30 ప్రాంతంలో వెళ్లిపోయాడని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని చెప్పాడు.

అనంతరం నాగేశ్వరరావు తమ్ముడు నాగులపాటి నాగేశ్వరరావును విచారించగా.. అన్న చెప్పిన సమాధానాలనే అతడు కూడా తడబాటు లేకుండా చెప్పాడు. పోలీసులు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రసాదరావు రాత్రి 8.30 ప్రాంతంలో వెళ్లిపోయాడని చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

ఇక తమదైన శైలిలో విచారించగా ప్రసాదరావును హత్య చేసింది తామే అని నిందితులు అంగీకరించారు.  చివర్లో తాము పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ‘‘దృశ్యం’’ సినిమాను ఫాలో అయ్యామని.. మా తమ్ముడు చిన్న తప్పు చెప్పడం వల్ల దొరికిపోయామని.. లేదంటే మీరు పట్టుకునేవారు కాదు కదా అని చెప్పడంతో ఖాకీలు అవాక్కయ్యారు.  

డీఎస్పీ అక్రమ సంబంధం: పక్కోడి పెళ్లాన్ని, భూమిని కూడా లాక్కొన్నాడు

అక్రమ సంబంధం....నడిరోడ్డుపై దారుణ హత్య

భర్తకు ఎయిడ్స్ సోకిందని... బంధువుతో భార్య అక్రమ సంబంధం

మోడల్ తో అక్రమ సంబంధం..భార్యను అడ్డు తప్పించేందుకు

వివాహితతో అక్రమ సంబంధం.. నీలదీసిన భార్యను..

ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య

ధనవంతుడి అక్రమ సంబంధం.. రక్షిస్తామని.. రూ.4 కోట్లు వసూలు చేసిన పోలీసులు

వదినతో అక్రమ సంబంధం.. చివరికిలా...

దెయ్యం పేరుతో భర్త కళ్లుగప్పి.. నవవధువు అక్రమ సంబంధం