Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

: తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది

why police arrested revanth reddy
Author
Kodangal, First Published Dec 4, 2018, 8:30 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. కొడంగల్ నుండి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఈ దఫా ఎన్నికల్లో ఓడించేందుకు టీఆర్ఎస్ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గత ఏడాది డిసెంబర్ మాసంలో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఆమోదించుకొని ఉప ఎన్నికలు వస్తాయని  టీఆర్ఎస్ భావించింది. ఐదుగురు మంత్రులను కొడంగల్‌లో మోహరించారు. కానీ ఉప ఎన్నికలు రాలేదు.ఈ లోపుగా అసెంబ్లీ రద్దైంది.

కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని  బరిలోకి దించారు. గత ఏడాది నుండి ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేంద్రీకరించారు.

కొడంగల్ నియోజకవర్గంలో ఈ దఫా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. అయితే రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి అడుగుపెట్టకుండా చేయాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ శక్తియుక్తులను మోహరించింది.

హరీష్ రావు ప్రత్యేకంగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై కేంద్రీకరించారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సభను ఏర్పాటు చేశారు.

ఈ సభను అడ్డుకొనేందుకుగాను తొలుత రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. అయితే ఆ తర్వాత బంద్ ను రేవంత్ రెడ్డి బంద్ పిలుపును ఉపసంహరించుకొన్నారు. కేసీఆర్ సభ సందర్భంగా నిరసన ర్యాలీలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వంద మంది కేసీఆర్ లు వచ్చినా కూడ పాతాళానికి తొక్కేస్తానని ఆదివారం నాడు ప్రకటించారు.  ఈ వ్యాఖ్యలపై ఈసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు.

ఇవాళ కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో  ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసీ ఆదేశాలను పురస్కరించుకొని తాము అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు రేవంత్ రెడ్డికి ఆదేశాలను చూపినట్టు పోలీసులు చెబుతున్నారు. కేసీఆర్ సభ పూర్తయ్యేవరకు రేవంత్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోనే ఉంచుకొంటారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios