Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

రేవంత్ రెడ్డిని విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్  హైకోర్టుకు మంగళవారం నాడు తెలిపారు.
 

high court serious comments on police over revanth reddy arrest
Author
Kodangal, First Published Dec 4, 2018, 4:55 PM IST


హైదరాబాద్:

హైదరాబాద్:రేవంత్ రెడ్డిని విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్  హైకోర్టుకు మంగళవారం నాడు తెలిపారు.రేవంత్ రెడ్డి అరెస్ట్ పై కాంగ్రెస్ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను  నాలుగు గంటల తర్వాత కోర్టు విచారణను ప్రారంభించింది.

 రేవంత్ రెడ్డి అరెస్ట్ పై  పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్  సెంటర్ నుండి కొడంగల్ కు తరలించినట్టు  ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఏజీ వాంగ్మూలాన్ని  హైకోర్టు రికార్డు చేసింది. 

అర్ధరాత్రి పూట రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి గల కారణాలను రేపు  వివరిస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను  రేపటికి వాయిదా వేసింది. 

రేవంత్ రెడ్డి ఆచూకీ తెలపాలని వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఇవాళ మధ్యాహ్నం కోర్టు ఆదేశించింది. ఈ విషయమై సమాచారం కోసం కేసును  15 నిమిషాల పాటు వాయిదా వేసింది కోర్టు.  ఆ తర్వాత మరోసారి వాయిదా పడింది.  ఈ లోపుగా రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు రేవంత్ రెడ్డిని  విడుదల చేశారు.

మంగళవారం నాడు మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత హైకోర్టు ఈ కేసు విచారణను తిరిగి ప్రారంభించింది. రేవంత్ రెడ్డిని  విడుదల చేసినట్టు ఏజీ హైకోర్టుకు  వివరించారు. 

సంబంధిత వార్తలు

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 


 

Follow Us:
Download App:
  • android
  • ios