హైదరాబాద్:  ఈ ఎన్నికల్లో  ప్రజా కూటమికి 65కి పైగా స్థానాలు వస్తాయని, టీఆర్ఎస్ కు 35 నుండి స్థానాలు వస్తాయని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు.


శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్ లో  విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్  మీడియాతో మాట్లాడారు. ఆర్జీ ఫ్లష్ టీమ్ సెప్టెంబర్ నుండి  పలు దఫాలుగా సర్వే నిర్వహించినట్టు ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో 68.5 శాతం నమోదైంది. ఈ దఫా 72 నుండి శాతం ఉండే అవకాశం ఉందన్నారు. తెలంగాణ గ్రామాల్లో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా ఖర్చులు పెరిగాయని ఆయన చెప్పారు. 

చివరి రెండు రోజుల పాటు ప్రధాన పార్టీల ప్రచారంతో పాటు అన్ని రకాలుగా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నారని చెప్పారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు  ఏడుగురు విజయం సాధిస్తారని చెప్పారు.

ఇబ్రహీంపట్నం, మక్తల్ లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. టీడీపీ , టీఆర్ఎస్  ముఖాముఖి పోటీలో 7 స్థానాల్లో విజయం సాధిస్తోందన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ ముఖా ముఖి స్థానాల్లో 7 స్థానాలతో పాటు మరో రెండు స్థానాల్లో గెలవడం కానీ కోల్పోయే ఛాన్స్ ఉందన్నారు.ఖమ్మం జిల్లాలో బీఎల్ఎప్  స్థానం విజయం సాధించే ఛాన్స్ ఉందని చెప్పారు.

 

టీఆర్ఎస్ 35(ప్లస్ ఆర్ మైనస్ 10)
ప్రజాకూటమి 65 (ప్లస్ ఆర్ మైనస్ 10)
బీజేపీ 07 (ప్లస్ ఆర్ మైనస్ 02)
ఎంఐఎం 06 -07
ఇండిపెండెంట్ 07-09

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల