Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఎన్నికల విధుల్లో నుండి తప్పిస్తూ ఈసీ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది

sp annapurna transfered from vikarabad
Author
Hyderabad, First Published Dec 5, 2018, 1:27 PM IST


హైదరాబాద్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఎన్నికల విధుల్లో నుండి తప్పిస్తూ ఈసీ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. అన్నపూర్ణ స్థానంలో అవినాష్ మహంతిని వికారాబాద్ ఎస్పీగా  బదిలీ చేశారు. మంగళవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి  అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ నెల 4వ తేదీన కోస్గిలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సభ ఉన్నందున నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చిన  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని  మంగళవారం నాడు తెల్లవారుజామున  ఇంటి నుండి  అరెస్ట్ చేసి జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన  లంచ్ మోషన్ పిటిషన్‌పై మంగళవారంనాడు, బుధవారం నాడు విచారణ చేసిన హైకోర్టు  పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఇవాళ మధ్యాహ్నం డీజీపీని హైకోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో  వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ‌ను విధుల నుండి తప్పించారు. 

ఢిల్లీలో ఉన్న అవినాష్ మహంతిని  వికారాబాద్ ఎస్పీగా నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను వెంటనే  డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు చేసింది.

రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా  పోలీసుల తీరుపై కూడ విమర్శలు వచ్చాయి.  నష్టనివారణ  కోసం ఎట్టకేలకు ఈసీ ఈ నిర్ణయం తీసుకొంది.  2005 బ్యాచ్‌‌కు  అవినాష్ మహంతి‌ వెంటనే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 


 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios