కొడంగల్: కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కు రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయం తెలియదని ఆయన న్యాయవాది ఆరోపించారు.

మంగళవారం తెల్లవారుజామున కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి న్యాయవాది మంగళవారం నాడు ఉదయం ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడారు. 

 ఈ నెల 2వ, తేదీన ఈసీ నుండి తమకు నోటీసులు అందిన విషయాన్ని రేవంత్ రెడ్డి న్యాయవాది వివరించారు.బంద్ కు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నట్టుగా ఆయన తెలిపారు.ఈ నోటీసులకు ఈ నెల 3వ తేదీన తాము వివరణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.

బంద్ ప్రతిపాదనను ఉపసంహరించుకొన్నామన్నారు. నిజంగానే తాము ఈ వ్యాఖ్యలు చేశామా.. మీడియాలో వచ్చాయో తెలియదు కానీ, ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నట్టుగా వివరణ ఇచ్చామన్నారు.

నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి వద్ద రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు ఉన్నాయా...  రేవంత్ రెడ్డి ప్రచారం మీద రిటర్నింగ్ అధికారి ఫిర్యాదులు చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ ప్రచార తీరు తెన్నులపై ఏమైనా రిటర్నింగ్ అధికారి చీఫ్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ లేదన్నారు. పోలీస్ కమిషన్ నడుస్తోందన్నారు.ఈ నెల 3వ తేదీ నుండి 4వ తేదీ సాయంత్రం వరకు కొడంగల్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించిన న్యాయవాది గుర్తు చేశారు. 

కానీ 144 సెక్షన్ ప్రకటించినా కూడ కేసీఆర్ సభను ఎలా అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు.144 సెక్షన్ అమల్లో ఉన్నందున కేసీఆర్ సభకు అనుమతి లేదని ప్రకటించారన్నారు. కేసీఆర్ సభకు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు