హైదరాబాద్: ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఎక్కువగా  ఇండిపెండెంట్లు ఈ ఎన్నికల్లో ఎక్కువగా  విజయం సాధించే చాన్స్  ఉందని  విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం నాడు పోలింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ  రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఓటర్లు  ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపుకు మొగ్గు చూపారని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల్లో  ప్రజా కూటమికి ఆధిక్యత వస్తోందని  లగడపాటి రాజగోపాల్ చెప్పారు.

బీజేపీ ఈ దఫా స్వంతంగా  పోటీ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేసింది. ఐదు స్థానాలను కైవసం చేసుకొంది. ఈ దఫా ఒంటరిగా పోటీ చేసినా కూడ బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాలను  కైవసం చేసుకోనే రీతిలో ఓటర్లను ప్రభావితం చేయడమంటే   ప్రభుత్వ వ్యతిరేకత కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేసింది, ఈ 13 స్థానాల్లో రెండు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించే ఛాన్స్ ఉందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అయితే నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో  టీడీపీ, ఎంఐఎం  పోటీ చేసింది.

ఈ సెగ్మెంట్ మినహాయిస్తే  టీడీపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటా పోటీ జరిగిందని లగడపాటి చెప్పారు.ఈ స్థానాల్లో  టీడీపీ 7 స్థానాల్లో విజయం సాధిస్తోందన్నారు.  ఈ స్థానాలకు అదనంగా మరో రెండు స్థానాలు దక్కే అవకాశం కూడ లేకపోలేదన్నారు. 

కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీకి 10 శాతం ఓట్లు ట్రాన్స్ ఫర్ కావడం సాధారణమన్నారు. 30 శాతం ఓట్లు ట్రాన్స్‌ఫర్ కావడం  సాధారణం కాదన్నారు. తెలంగాణలో టీడీపీ అతి చిన్న పార్టీ అని ఆయన గుర్తు చేశారు. అయినా  టీడీపీకి ఇన్ని సీట్లు రావడం  ప్రభుత్వ వ్యతిరేకత వల్లే వచ్చే అవకాశం ఉందన్నారు.కూటమి అభ్యర్థులకు ఓటు వేయకపోతే, బీజేపీకి ఓటు వేసేందుకు ఓటర్లు మొగ్గు చూపారని ఆయన గుర్తు చేశారు. కానీ, టీఆర్ఎస్ వైపుకు మొగ్గు చూపలేదని ఆయన గుర్తు చేశారు.

 

సంబంధిత వార్తలు

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల