Asianet News TeluguAsianet News Telugu

అమృతను కిడ్నాప్ చేసి, ప్రణయ్‌ను చంపాలని స్కెచ్: ఎస్పీ

కులం తక్కువవాడిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకే  మారుతీరావు సుపారీ కిల్లర్స్‌తో ప్రణయ్ ను హత్య చేయించాడని  నల్గొండ ఎస్పీ రంగనాథ్ చెప్పారు. 
 

Nalgonda sp ranganath briefs on pranay murder case
Author
Miryalaguda, First Published Sep 18, 2018, 5:21 PM IST

నల్గొండ: కులం తక్కువవాడిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకే  మారుతీరావు సుపారీ కిల్లర్స్‌తో ప్రణయ్ ను హత్య చేయించాడని  నల్గొండ ఎస్పీ రంగనాథ్ చెప్పారు. 

నాలుగు రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని జ్యోతి ఆసుపత్రి వద్ద ప్రణయ్‌ను దారుణంగా హత్య చేశారు. తక్కువ కులానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు మారుతీరావే  కిరాయి హంతకులతో ఈ హత్య చేయించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ రంగనాథ్  మంగళవారం నాడు వివరించారు.

Nalgonda sp ranganath briefs on pranay murder case

ఈ కేసులో మాజీ ఐఎస్ఐ ఉగ్రవాది అస్గర్ అలీతో పాటు బారీ,  బీహార్ రాష్ట్రానికి చెందిన కిరాయి హంతకుడు  సుభాష్ శర్మ, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. బారీ, అస్గర్ అలీ గుజరాత్ మాజీ హోం మంత్రి హిరేన్ పాండ్యా హత్య కేసులో నిందితులని ఆయన చెప్పారు.

జూలై మాసంలోనే  హైద్రాబాద్, మిర్యాలగూడల్లోనే ఈ ఘటనకు సంబంధించిన పలు దఫాలు చర్చించినట్టు ఎస్పీ చెప్పారు. మాజీ ఐఎస్ఐ ఉగ్రవాది అస్గర్ అలీ, బారీ, కరీంలతో మారుతీరావు సంప్రదించినట్టు దర్యాప్తులో తేలిందన్నారు.

ఈ మేరకు అడ్వాన్స్‌గా రామోజీ ఫిలింసిటీ సమీపంలో కారులో కరీం అస్గర్ అలీకి డబ్బులు ఇచ్చినట్టు చెప్పారు. అయితే మారుతీరావుకు తన కూతురు అమృతవర్షిణి గర్భవతి అని తెలియడంతో ఆమె గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు.

Nalgonda sp ranganath briefs on pranay murder case

అమృతవర్షిణికి గర్భస్రావం చేయాలని మారుతీరావు  డాక్టర్ జ్యోతిని ఒత్తిడి చేశాడు. కానీ, ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదన్నారు. ప్రణయ్ ను హత్య చేసేందుకు రెండుసార్లు ప్లాన్ చేసినట్టు ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ప్రణయ్ హత్యకు అస్గర్ అలీ, బారీ స్కెచ్ వేశారని చెప్పారు. బారీకి, అస్గర్ అలీకి ప్రణయ్ ఇంటిని మారుతీరావు చూపించినట్టు చెప్పారు.

ప్రణయ్ హత్యకు తొలుత రెండు కోట్లు డిమాండ్ చేసినట్టు చెప్పారు. అయితే చివరకు కోటి రూపాయాలకు డీల్ కుదిరిందన్నారు. ప్రణయ్ హత్య కోసం ప్లాన్ ప్రకారంగా నిందితులు ప్రయత్నించారని చెప్పారు. తొలుత అమృత వర్షిణిని కిడ్నాప్ చేసి ప్రణయ్ ను హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు ఎస్పీ చెప్పారు. దృశ్యం సినిమాలో మాదిరిగా చేయాలని మారుతీరావు ప్లాన్ వేశారని ఎస్పీ చెప్పారు.

ప్రణయ్ హత్య కోసం అస్గర్ అలీ, బారీలు మూడు సిమ్ కార్డులు , ఫోన్లు కొనుగోలు చేసినట్టు చెప్పారు. మరోవైపు స్కూటర్ ను కూడ కొనుగోలు చేశారని చెప్పారు.
తొలుత ప్రణయ్ ఇంటికే నిందితులు వచ్చి కారు అద్దెకు ఇస్తారా అని ప్రశ్నించారని చెప్పారు. అయితే కారు అద్దెకు ఇవ్వబోమని చెప్పారు.  రిసెప్షన్ జరిగిన ఆగష్టు 17వ తేదీననే ప్రణయ్ ను హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు చెప్పారు.

అయితే  ఆ రోజు రిసెప్షన్ రోజు మిర్యాలగూడ డిఎస్పీ  ఎస్ఐ, కానిస్టేబుళ్లను బందోబస్తు కోసం పంపినట్టు చెప్పారు. అదే రోజు చంపాలని భావించారు. కానీ ఆ రోజు సాధ్యం కాలేదన్నారు.  దృశ్యం సినిమాలో మాదిరిగా మారుతీరావు ప్లాన్ చేశారు. ప్రణయ్ హత్యకు రెండు గంటల ముందే మారుతీరావు మిర్యాలగూడ నుండి  బయలుదేరాడని చెప్పారు.

వేములపల్లి వద్ద డీఎస్పీ కన్పిస్తే కొద్దిసేపు కారు ఆపి వినాయక నిమజ్జనం గురించి మాట్లాడినట్టు చెప్పారు. ఆ తర్వాత నల్గొండ కలెక్టరేట్ లో ఉన్నట్టుగా నమ్మించేందుకు ప్లాన్ చేసుకొన్నారని, వివాహ రిసెప్షన్ వల్ల తనకు మరింత ఇబ్బందులు ఎదురౌతాయని భావించినట్టు మారుతీరావు చెప్పారని వివరించారు.

ప్రణయ్ హత్య జరిగిన సమయంలో తనకు సంబంధం లేదని నమ్మించేందుకు మారుతీరావు ప్లాన్ చేసినట్టు చెప్పారు. హత్య రోజున ప్రణయ్ దంపతులను అస్గర్ అలీ, సుభాష్ శర్మలు ఫాలో అయ్యారని చెప్పారు.

అమృతను కిడ్నాప్ చేసి చంపే కుట్రకు కొందరిని మిర్యాలగూడలో ఉంచారని, అయితే హత్య కోసం  వచ్చిన వారంతా మద్యం తాగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కానీ, పని కాదనే ఉద్దేశ్యంతోనే అస్గర్ అలీ మరో ముఠాను రంగంలోకి దింపాలని భావించాడని చెప్పారు.

దీని కోసం సుభాష్ శర్మను రంగంలోకి దించినట్టు ఎస్సీ చెప్పారు.బారీ మిత్రుడికి సుభాష్ శర్మకు స్నేహితుడని చెప్పారు. సుభాష్ శర్మను బారీ తన స్నేహితుడి సహాయంతో సుభాష్ శర్మను రంగంలోకి దించినట్టు తెలిపారు.

ఈ ఘటనతో రాజకీయాలతో సంబంధం లేదన్నారు. మారుతీరావు వ్యక్తిగతంగానే ఈ ఘటనకు కారకుడయ్యాడని ఆయన చెప్పారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అమృత దంపతులను బెదిరించలేదన్నారు. వేముల వీరేశం కూడా కులాంతర వివాహం చేసుకొన్నట్టు చెప్పారు. 

సుభాష్ శర్మ ఓ దొంగతనం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవించినట్టు చెప్పారు. అయితే గతంలో హత్యలు చేసిన కేసులు సుభాష్ శర్మపై లేవన్నారు. దొంగతనాలు చేసిన కేసులు సుభాష్ శర్మపై ఉన్నాయని ఆయన తెలిపారు. 

మారుతీరావు భార్య అమృతవర్షిణికి ఫోన్ చేసేదని... అమృతతో ఫోన్లో మాట్లాడిన విషయాలను భర్తతో చెప్పేదన్నారు.  మారుతీరావు ఈ సమాచారాన్ని కరీం, బారీ, అస్గర్ అలీకి సమాచారాన్ని ఇచ్చేవాడని చెప్పారు.

ప్రతి శనివారం నాడు జ్యోతి ఆసుపత్రికి ప్రణయ్ దంపతులు వచ్చే విషయం కూడ నిందితులకు మారుతీరావు చేరవేశాడని ఆయన తెలిపారు.ప్రతి శనివారం నాడు జ్యోతి ఆసుపత్రికి ప్రణయ్ దంపతులు వచ్చే విషయం కూడ నిందితులకు మారుతీరావు చేరవేశాడని ఆయన తెలిపారు. వినాయకచవితి రోజున  మారుతీరావుతో అమృత మాట్లాడిందని, మరునాడు జ్యోతి ఆసుపత్రికి వెళ్లే సమాచారాన్ని మారుతీరావు తెలుసుకొన్నాడని, ఈ విషయాన్ని అస్గర్ అలీకి, బారీకి సమాచారాన్ని చేరవేశాడని రంగనాథ్ చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ...

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios