మిర్యాలగూడ: అమృతవర్షిణిని పెళ్లి చేసుకొన్న తర్వాత  ప్రణయ్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొన్నారు.  ప్రతి రోజూ తమ ఇంటి చుట్టూ పరిసరాల్లో  ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా అనే కోణంలో  ప్రణయ్ తల్లి హేమలత సీసీ కెమెరాల పుటేజీని  పరిశీలించేవారు. అనుమానాస్పదంగా  ఎవరైనా కన్పిస్తే ప్రణయ్‌తో పాటు కోడలు అమృతవర్షిణిని ప్రేమలత హెచ్చరించేది.

మూడు రోజుల క్రితం మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి ఆసుపత్రి వద్ద కిరాయి హంతకుడు ప్రణయ్‌ను దారుణంగా హత్య చేశాడు.  ఈ ఘటనలో  ప్రణయ్ అక్కడికిక్కడే మరణించాడు. ప్రముఖ బిల్డర్  మారుతీరావు కూతురు అమృతవర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకే  ప్రణయ్‌ను ఆయన హత్య చేయించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ప్రణయ్ సోదరుడు అజయ్  ఉక్రెయిన్‌లో ఉంటున్నాడు. సోదరుడు మృతి చెందిన విషయం తెలిసిన అజయ్  ఉక్రెయిన్ నుండి హుటాహుటిన మిర్యాలగూడకు బయలుదేరాడు.మధ్యాహ్నం అజయ్ మిర్యాలగూడకు చేరుకొంటాడు. అజయ్ వచ్చిన తర్వాత  ప్రణయ్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఆరు మాసాల క్రితం అమృతవర్షిణిని ప్రణయ్ పెళ్లి చేసుకొన్నాడు. అయితే ఈ పెళ్లి  మారుతీరావుకు ఇష్టం లేదు. దీంతో  అతను పలు మార్లు బెదిరింపులకు పాల్పడ్డాడని కూడ ప్రణయ్ తల్లి  చెప్పారు.

మారుతీరావు నుండి ప్రమాదం ఉందని భావించి జాగ్రత్తలు తీసుకొన్నారు ప్రణయ్ కుటుంబసభ్యులు.  ప్రణయ్ ఇంటి చుట్టూ  నాలుగు మార్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల పుటేజీని ప్రణయ్ తల్లి ప్రేమలత ఎప్పటికప్పుడు పరిశీలించేవారు. 

ప్రణయ్ హత్యకు మూడు రోజుల ముందుగానే  ప్రణయ్ ను హత్య చేసిన నిందితుడు  ఇంటి పరిసరాల్లో తచ్చాడినట్టుగా ప్రేమలత చెబుతున్నారు. అయితే  అతని ప్రవర్తనపై అనుమానం కలగలేదన్నారు.అయితే ప్రణయ్ హత్య చేసేందుకు అనువైన ప్రదేశం కోసం...నిందితుడు రెక్కీ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

మారుతీరావుకు మిర్యాలగూడలో తిరిగే హక్కు లేదన్నారు. మారుతీరావును ఉరి తీయాలని ప్రేమలత కోరారు.  తన కొడుకు కంటే అందమైన అల్లుడు మారుతీరావుకు వచ్చేవాడా అని ఆమె ప్రశ్నించారు. తన కొడుకు కాలుగోటికి కూడ మారుతీరావు పనికిరాడన్నారు ప్రేమలత.కరీం అనే రాజకీయ నేత తన కొడుకును నమ్మించాడని కూడ ప్రణయ్ తల్లి  ఆరోపించారు. కరీం ద్వారానే  ప్రణయ్ హత్య జరిగిందని ఆమె అనుమానిస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)