జైల్లోనే చచ్చిపోండి... బయటకు వస్తే జనమే మిమ్మల్ని చంపేస్తారని ప్రణయ్ సోదరుడు  అజయ్ మారుతీరావు కుటుంబసభ్యులను హెచ్చరించారు. 


మిర్యాలగూడ: జైల్లోనే చచ్చిపోండి... బయటకు వస్తే జనమే మిమ్మల్ని చంపేస్తారని ప్రణయ్ సోదరుడు అజయ్ మారుతీరావు కుటుంబసభ్యులను హెచ్చరించారు. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చేస్తున్న అజయ్ ఆదివారం నాడు మధ్యాహ్నం మిర్యాలగూడకు చేరుకొన్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రెండు రోజుల క్రితం మిర్యాలగూడలో జ్యోతి ఆసుపత్రి వద్ద ప్రణయ్ ను మారుతీరావు కిరాయి హంతకులతో హత్య చేయించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అజయ్ ఆదివారం నాడు ఇంటికి చేరుకొన్నాడు.

ఇంటికి రాగానే సోదరుడి భౌతికకాయాన్ని చూసి అజయ్ భోరున విలపించాడు. వదిన అమృత వర్షిణిని అక్కున చేర్చుకొన్నాడు. వదినను ఓదార్చాడు. తన సోదరుడిని చంపిన మారుతీరావును ఆయన సోదరుడు శ్రవణ్ ‌ను ఆ కుటుంబాన్ని ప్రజలే చంపుతారని చెప్పారు.

జైల్లోనే చచ్చిపోవాలని మారుతీరావును అజయ్ హెచ్చరించాడు. వదినను పెళ్లి చేసుకొన్నాడని... అంతకుముందు నుండి మారుతీరావును బెదిరించారని ఆయన గుర్తు చేశారు. ప్రతిరోజూ వదినకు మారుతీరావు ఆయన భార్య ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లేది.. ఎక్కడ ఉన్నది తెలుసుకొనేవారని అజయ్ చెప్పారు.

మారుతీరావును మేం కానీ, మా కుటుంబసభ్యులు చంపబోమన్నారు. ప్రజలే వారిని చంపేస్తారని చెప్పారు. కులం పేరు చెప్పి శ్రవణ్ తన సోదరుడు ప్రణయ్ ను కొట్టారని అజయ్ గుర్తు చేసుకొన్నాడు. చనిపోవడానికి ముందు రోజు రాత్రి ప్రణయ్ మాట్లాడినట్టు అజయ్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.

ఇలాంటి సైకో తండ్రిని తాను ఎక్కడా చూడలేదన్నారు అజయ్. శ్రవణ్ కూడ పెద్ద సైకో అంటూ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెళ్లి చేసుకొన్న సమయంలో తాను రాలేదన్నారు. రిసెప్షన్ సమయంలోనే తాను ఇక్కడికి వచ్చినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. 

ఈ వార్తలు చదవండి

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో