Asianet News TeluguAsianet News Telugu

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో  ప్రేమించి పెళ్లి చేసుకొన్న ప్రణయ్‌ హత్య కేసులో బారిని ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బారి స్కెచ్‌తోనే ప్రణయ్ మర్డర్ జరిగిందని  పోలీసులు అనుమానిస్తున్నారు.

pranay murder case:who is bari
Author
Miryalaguda, First Published Sep 17, 2018, 11:20 AM IST


నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో  ప్రేమించి పెళ్లి చేసుకొన్న ప్రణయ్‌ హత్య కేసులో బారిని ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బారి స్కెచ్‌తోనే ప్రణయ్ మర్డర్ జరిగిందని  పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే ప్రణయ్  హత్య లో ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బారి  ఎవరనే విషయమై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మూడు రోజుల క్రితం  జ్యోతి ఆసుపత్రి వద్ద ప్రణయ్‌ అనే యువకుడిని  ఓ వ్యక్తి హత్యచేశాడు. ప్రణయ్ భార్య, తల్లి ముందే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

ఈ హత్య కోసం  అమృతవర్షిణి తండ్రి మారుతీరావు  కోటి రూపాయాలను సుపారీగా ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ కేసు విషయమై పోలీసులు అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నారు.

బారికి  ఉగ్రవాదులతో గతంలో సంబంధాలున్నాయి.  గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో  శిక్షను అనుభవించాడు బారి. అస్గర్ అలీతో పాటు బారి ఈ కేసులో నిందితుడుగా ఉన్నాడు. అయితే  అస్గర్ అలీ ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్ ‌లో మృతి చెందాడు. 

అస్గర్‌అలీ నల్గొండ కేంద్రంగా  ఐఎస్ఐ బలోపేతం కోసం అప్పట్లో పనిచేశాడు.  అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండగోని మైసయ్యగౌడ్‌పై మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో  తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో మైసయ్యగౌడ్  తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు. ఆ తర్వాత అస్గర్ అలీ గుజరాత్ మాజీ హోం శాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో కీలకపాత్ర పోషించాడు. అస్గర్ అలీతో పాటు బారీ కూడ ఈ కేసులో  కీలకంగా వ్యవహరించారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

మారుతీరావును  గతంలో బారి కిడ్నాప్ చేసినట్టు  ప్రచారంలో ఉంది. ఈ కిడ్పాన్ ఘటన తర్వాత బారితో మారుతీరావుకు సంబంధాలు మెరుగుపడినట్టు సమాచారం. ప్రణయ్ ను హత్య చేసేందుకు బారిని మారుతీరావు సంప్రదిస్తే ఆయన ఈ మేరకు  షఫీని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.

బారి వేసిన పథకం ప్రకారంగానే ప్రణయ్ హత్య చోటు చేసుకొందని  సమాచారం. హరేన్ పాండ్యా కేసులో శిక్ష అనుభవించిన తర్వాత బారి హైద్రాబాద్ కేంద్రంగా దందాలు నడుపుతున్నట్టు సమాచారం.

మారుతీరావు కోరిక మేరకు  ప్రణయ్ ను చంపేందుకు షఫీని బారి రంగంలోకి దింపాడు. దీని కోసం 20 రోజుల క్రితమే బారికి మారుతీరావు  రూ. 15 లక్షలను ఇచ్చాడని తెలుస్తోంది. మరో వైపు మరో రూ. 3 లక్షలను కూడ  మారుతీరావు బారికి ఇచ్చాడని సమాచారం. ప్రణయ్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు  కిరాయి హంతకులకు చేరవేసే ఏర్పాటును కూడ మారుతీరావు చేశారని పోలీసుల విచారణలో తేలింది.

ఈ వార్తలు చదవండి

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

 

 

Follow Us:
Download App:
  • android
  • ios