నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమృత వర్షిణి అనే యువతి తన తండ్రిని ఎదిరించి మరీ తాను ప్రేమించిన దళిత యువకుడు ప్రణయ్ ని పెళ్లాడింది. అయితే శుక్రవారం మిర్యాలగూడ లో ఓ ఆస్పత్రి వద్ద గుర్తు తెలియని దుండగులు ప్రణయ్ ని అతి దారుణంగా హతమార్చారు. ఈ హత్య అమృత తండ్రి మారుతి రావు చేయించినట్లు అనుమానిస్తున్న పోలీసులు అతడిని ఎ1 నిందితుడిగా, అతడి సోదరుడు శ్రవణ్ ను ఎ2 నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మారుతి రావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎస్పీ రంగనాథ్ ఖండించారు. ఈ కేసులో నిందితులెవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేశామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.

ప్రస్తుతం ఆస్పత్రితో పాటు మృతుడి ఇంటి వద్ద ఉన్న సిసి కెమెరా రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో వున్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు ఎస్పీ ప్రకటించారు.

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

నయీం బ్యాచ్ తోనే ప్రణయ్ ని చంపాలని చూశారు.. అమృత

ప్రణయ్ హత్య కలచివేసింది: అమృతకు ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామర్శ

ప్రణయ్ హత్య: భార్య అమృత షాక్, 20 రోజుల క్రితమే రెక్కీ

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు