మిర్యాలగూడ: ప్రపంచంలో ప్రేమ పెళ్లిళ్లు ఎన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రులను ఎదిరించి ఎంతో మంది వివాహం చేసుకుంటున్నారు. తాము అలాగే పెళ్లి చేసుకున్నాం. తమ తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి ఇవాళ కాకపోయినా రేపు అయినా మారతారని ఆశించాం. కానీ నమ్మించి ఇంతలా మోసం చేస్తారని ఊహించలేదని విలపిస్తోంది పరువు హత్యకు గురైనప్రణయ్ భార్య అమృతవర్షిణి. 

వివాహం ఇష్టం లేకపోవడంతో తన తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ లు తమను విడదీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని అమృత చెప్తోంది. పెళ్లి అయిన తర్వాత నిత్యం తమ తండ్రి తమను ఫాలో అయ్యేవారని చెప్తోంది. తాము ఎక్కడికి వెళ్లినా ఫాలో అవుతున్నారని తెలుసు అని కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని కన్నీరుమున్నీరవుతుంది. ప్రాణాలు తీస్తారని ఎవరైనా ఊహిస్తారా...కూతురు భర్తను చంపేస్తారా... అంటూ రోదిస్తోంది.  

వివాహం తర్వాత తాము ఎంతో భయపడ్డామని అమృత తెలిపింది. ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నామని, ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్లమని నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తమకు సూచించారని తెలిపింది. తన తండ్రిని, బాబాయిని ఎస్పీ రంగనాథ్ పిలిచి హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకుంది. వాళ్లు తన పరిధిలో ఉన్నారని, వాళ్లకు ఏమైనా హాని జరిగితే సహించేది లేదంటూ ఎస్పీ హెచ్చరించినట్లు చెప్తోంది.  
 
2011 నుంచి తాను, ప్రణయ్ ప్రేమించుకుంటున్నామని తెలిపింది అమృత. తమ ప్రేమ ఇంట్లో ఇష్టం లేకపోవడంతో తనను తండ్రి బాబయి ఎంతో నరకం చూపించారని గుర్తు చేసుకుని హడలిపోతుంది.  ఇంట్లో నిర్భందించడం,కొట్టడం, బెదిరించడం ఇలా ఎన్నో చేశారని ఆ తర్వాతే తాము పెళ్లి చేసుకున్నామని అమృత చెప్పింది. తనకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలైన తర్వాతే ప్రణయ్ పెళ్లికి రెడీ అయ్యాడని తెలిపింది. ఎన్ని కష్టాలు పడ్డా ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆ బాధలన్నీ మరచిపోయి హాయిగా ఉంటున్నానని తెలిపింది. 

కానీ నిత్యం దినదినగండంగా గడిపేవాళ్లమని చెప్తోంది. తమను నిత్యం ఎవరో ఒకరు ఫాలో అవుతున్నట్లు తెలుస్తుండటంతో భయం వేసేది అని చెప్పుకొచ్చింది. తాము ఎక్కడికి వెళ్లినా ఇట్టే నాన్నకు తెలిసిపోయేదని చెప్పి తల్లడిల్లిపోతుంది. 

నెల రోజుల ముందు హాస్పిటల్‌లో నాన్న ఉన్నారు. చూడ్డానికి రమ్మని అమ్మతరఫు వాళ్లు బలవంతం చేస్తే, బెంగళూరు వెళుతున్నామని చెప్పి హాస్పిటల్‌కు వెళ్ల లేదని చెప్తోంది. ఇలా అనుక్షణం తమను ఫాలో అయ్యేవారని కానీ ప్రాణాలు తీసేందుకే వాళ్లు ఫాలో అవుతున్నారని గమనించలేకపోయామంటోది అమృత. 

తనను హాస్పటల్ కి రమ్మని అమ్మతరప బంధవులు ఫోన్ చేసినప్పుడు వెళ్లలేదని ఆ మరుసటి రోజు నంబర్ లేని బైక్ మీద ఓ అజ్ఞాతవ్యక్తి మా ఇంటికి వచ్చారని గుర్తు చేసుకుంది. కార్ రెంట్‌కి ఇస్తారా అంటూ మామయ్యను అడిగారని తెలిపింది. బహుశా ఇంట్లో ఎవరున్నారు అనే విషయం తెలుసుకోవడానికి వచ్చినట్లుగా అనిపించిందని కానీ అనుమానంగా ఏమీ లేకపోవడంతో ఆ విషయాన్ని పోలీసులకు చెప్పలేదుని బోరున విలపిస్తోంది. 

తన తండ్రి తన భర్తను అంతమెుందించేందుకు మెుదటి నుంచే దృష్టిపెట్టారని కానీ తామే ఊహించుకోలేకపోయామని ఆమె బోరున విలపిస్తోంది. తన తండ్రి ఇంతలా చేస్తారని ఎవరైనా ఊహిస్తారా అంటూ గుండెలు పగిలేలా రోదిస్తోంది. 

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)