మిర్యాలగూడ: అంకుల్ .. మీ అమ్మాయి విషయంలో  మీరనుకొంటున్నట్టుగా నేను కూడ మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌... అంటూ  ప్రణయ్ తన డైరీలో  రాసుకొన్నాడు. ప్రేమ పెళ్లి గురించి  డైరీలో ప్రణయ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 

అతి చిన్న వయస్సులోనే  సమాజంలోనే కుల రక్కసిని.. ప్రేమ పెళ్లి విషయాలపై ప్రణయ్ తన డైరీలో  రాసుకొన్నాడు. అమృత వర్షిణిని పెళ్లి చేసుకొనే ముందు తాను ఎంత మానసిక ఘర్షణకు గురయ్యాడనే విషయాలను ఆ డైరీలో పొందుపర్చాడు. 

ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం తప్పా అంటూ ఆయన ప్రశ్నించాడు. అంతేకాదు మారుతీరావును ఉద్దేశించి కూడ  ప్రణయ్ కూడ డైరీలో  కీలక విషయాలను ప్రస్తావించాడు. అంకుల్  మీ కూతురికి మీరనుకొంటున్నట్టుగానే మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌ను నేను అవుతానని రాశాడు. 

 మీరు మీ అమ్మాయికి తెచ్చే అబ్బాయిలో ఉండే పర్‌ఫెక్ట్ లక్షణాలు ఏవైతే కోరుకొంటున్నారో...ఆ లక్షణాలు  తనలో ఉన్నాయని ప్రణయ్ ఆ డైరీలో రాసుకొన్నాడు.నాకు మీ అమ్మాయే ప్రపంచం .

మీరు సెలెక్ట్  చేసే అబ్బాయిని కాకపోవచ్చు.. కానీ  మీ అమ్మాయిని అమ్మ ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమిస్తానని ప్రణయ్ రాసుకొన్నాడు. నాన్న ప్రేమకు కూడ లోటు రానివ్వనని చెప్పారు. నాకు అక్కా చెల్లెలు. అన్నదమ్ములు ఉన్నారు. వయస్సులో ఉండే చిలిపితనం తప్ప... మీరు అనుకొనే మిస్టర్ ఫర్‌ఫెక్ట్ లక్షణాలు నాలో ఉన్నాయని ప్రణయ్ డైరీలో రాసుకొన్నాడు.

చెడు అలవాట్లు ఉంటే  ఆ అబ్బాయిని తిరస్కరించాలని కూడ ప్రణయ్ తన డైరీలో రాసుకొన్నారు.  ప్రేమించి  పెళ్లి చేసుకోవడానికి నలుగురు స్నేహితులు ఉంటే  సరిపోతోందన్నారు. జీవితాంతం కలిసి బతకాలంటే  పెద్దల సహకారం అవసరమని ప్రణయ్ డైరీ చెప్పాడు.

కులం, మతం, ఆస్తి పాస్తుల విషయాన్ని చూపి  ప్రేమికులను విడదీయకండని ప్రణయ్ డైరీలో రాశాడు.మీ అమ్మాయిని పెళ్లి చేసుకొంది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికే మాత్రమేనని ప్రణయ్ ఆ డైరీలో రాసుకొన్నాడు.

మందు,సిగరెట్ ఇతర చెడు అలవాట్లు ఉన్న పేరేంట్స్ ను రిజెక్ట్ చేయాలని రాసుకొన్నాడు. చదువులేని వారిని రిజెక్ట్ చేయాలని రాసుకొన్నాడు. మరోవైపు ప్రేమికుల మధ్య ఏదైనా పొరపొచ్చాలు వస్తే వారిద్దరిని విడదీసేందుకుగాను  ప్రయత్నించేవారు ఎక్కువగా ఉంటారని చెప్పారు.

లక్షలు సంపాదించకపోవచ్చు... కారులో మీ కూతురును తిప్పకపోవచ్చు... కానీ బైక్ పై తిప్పుతానని ప్రణయ్ డైరీలో రాసుకొన్నాడు.మీ కూతురును మహారాణిగా చూసుకొంటానని ఆయన చెప్పారు.

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా అంటూ ప్రణయ్ డైరీలో రాసుకొన్నాడు. ప్రతి చరిత్రలో కూడ ప్రేమలేని కథ ఉండదన్నారు. ప్రేమలేని జీవితం పూర్తి కాదన్నారు. ప్రేమను ప్రేమగా చూడాలని ఆయన కోరారు.నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదన్నారు. ప్రేమను.. ప్రేమించిన అమ్మాయిని అంత సులభంగా ఎలా మర్చిపోతామని ప్రణయ్ డైరీలో రాసుకొన్నాడు. 

కూతురు ఎక్కడైనా తిరగొచ్చు కానీ.. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోకూడదా అంటూ ప్రణయ్ డైరీలో రాసుకొన్నాడు.ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించని ప్రేమను రిజెక్ట్ చేయాలని... ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలను కారణంగా చూపుతూ ప్రేమను రిజెక్ట్ చేయొద్దని ప్రణయ్ రిక్వెస్ట్ చేశాడు. 
 

ఈ వార్తలు చదవండి

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)