నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం దారుణం చోటుచుకుంది. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడిని యువతి తండ్రి అతి దారుణంగా హత్య చేయించాడు. దీంతో ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.

ఈ హత్యకు ముందే అమృత తండ్రి మారుతిరావు మిర్యాలగూడ నుండి వెళ్ళిపోయాడు. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అమృత తండ్రే ప్రణయ్ ను హత్య చేయించినట్లు అనుమానిస్తున్న పోలీసులు అతన్ని ఎ1 నిందితుడిగా చేర్చారు. అలాగే అమృత బాబాయ్ ని ఎ2గా నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలచేత గాలింపు చేయించారు. దీంతో ప్రణయ్ హత్యకు అరగంట ముందే మిర్యాల గూడ నుండి వెళ్లిపోయిన మారుతి రావు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ఉన్నత కులానికి చెందిన అమృత, దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ లు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట పెద్దలకు తమ ప్రేవ విషయం తెలియజేశారు. అయితే దళిత యువకుడికి తన కూతురినిచ్చి పెళ్లి చేయడానికి అమృత తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. దీంతో తండ్రిని ఎదిరించి మరీ అమృత తాను ప్రేమించిన ప్రణయ్ ని పెళ్లి చేసుకుంది.

దీంతో వీరిపై కోపాన్ని పెంచుకున్న మారుతిరావు అల్లున్ని చంపడానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో మారుతి రావుతో పాటు అతడి సోదరుడు శ్రవణ్ కోసం పోలీసులు నిన్నటి నుండి గాలిస్తున్నారు. దీంతో ఇవాళ మారుతిరావు పోలీసులకు పట్టుబడ్డాడు.

అయితే ప్రణయ్ పరువు హత్యకు నిరసనగా దళిత సంఘాలు మిర్యాలగూడలో ఆందోళన చేపట్టాయి. ఇవాళ మిర్యాలగూడ బంద్ చేపట్టాయి. ప్రణయ్ మృతదేహాన్ని టీఆర్ఎస్ నాయకులు గుత్తాసుఖేందర్ రెడ్డి తో పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే  భాస్కర్ రావు సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చిన వారు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
 

సంబంధిత వార్తలు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)