మిర్యాలగూడ: తన భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న అమృతవర్షిణీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తన కళ్లెదుటే ప్రేమించి పెళ్లాడని భర్త ప్రణయ్ హత్యకు గురవ్వడంతో షాక్ కు గురై ఆస్పత్రిలో చికిత్సపొందిన అమృతవర్షిణి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే షాక్ నుంచి తేరుకున్న అమృత తనకు జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది.  

ప్రణయ్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తనతో జీవితాంతం ఉంటాడనుకున్న ప్రణయ్ ను తన తండ్రి హత్య చేయించడంతో కుమిలిపోతుంది అమృత. తనలాంటి పరిస్థితి ఎవరికి రావొద్దంటూ భగవంతుడిని వేడుకుంటోంది. తన తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. తన భర్తను హత్య చేయించినంత మాత్రాన తాను పుట్టింటికి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసింది.

తనను తన ఇంటికి తీసుకెళ్దామనే తన తండ్రి మారుతీరావు తనను అబార్షన్ చేయించుకోమనేవాడని తెలిపింది అమృత. ప్రణయ్ ని హత్య చేసిన తర్వాత అబార్షన్ చేయించి తనను తీసుకెళ్లిపోదామని తండ్రి ప్లాన్ చేశారని తాను అక్కడికి వెళ్లనని తెలిపారు. తాను తన అత్తమామలతోనే ఉంటానని స్పష్టం చేసింది. తన కడపులో పెరుగుతున్న బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డలో ప్రణయ్ ను చూసుకుంటానంటూ బోరున విలపించింది.  
 
ప్రణయ్‌ని హత్య చేయించింది మా నాన్నేనని అమృత తెలిపింది. తండ్రి ఆలోచనల గురించి అమ్మ ఎప్పటికప్పుడు చెప్పేదని తెలిపింది. ప్రణయ్‌ని చంపేందుకు చాలా రోజులు రెక్కీ నిర్వహించారని చెప్పింది. ఆస్పత్రులో చెకప్ పూర్తి అయిన తర్వాత తాను ప్రణయ్ నవ్వుకుంటూ వెళ్తున్న సమయంలో పక్క నుంచి ఎవరో గట్టిగా కొట్టారని వెంటనే ప్రణయ్ కిందపడిపోయాడని ఘటనను తలచుకుని రోదిస్తోంది. తన భర్తను రక్షించుకునేందుకు ఆస్పత్రికి పరుగెత్తకు వెళ్లానని అయినా తన భర్తను కాపాడుకోలేకపోయానని వాపోయింది. తన నూరేళ్ల జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదని కన్నీరుమున్నీరవుతోంది. 

కులాంతర వివాహం చేసుకోవడంతో తన తండ్రి హత్య చేయించారని ఇది చాలా దుర్మార్గమని వాపోయింది అమృత. ఈ సందర్భంగా కులాంతర వివాహం చేసుకున్న వారికి అమృత సందేశం ఇచ్చింది. కులం అనేది సమాజం పెట్టుకున్న పరిధి. కులాన్ని మనం పెట్టుకున్నదే. ఎవరైనా సరే పరిణతి చెంది ఆలోచించాలి. అగ్రకులంలో పుట్టిన నా తండ్రి ప్రణయ్‌ను చంపించాడు. కులాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేం. ప్రవర్తనను బట్టి ఉంటుంది. 

కులం పోతేనే సమాజం బాగుంటుంది. ప్రేమ వివాహాలు చేసుకున్న వారిని తల్లిదండ్రులు చంపేస్తున్నారు. కుల వివక్ష కోసం పోరాడాలని ప్రణయ్ నాతో అంటుండేవాడు అని అమృత కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఈ సందేశమిచ్చింది. భర్తను పొగొట్టుకోవడం, తన తండ్రే ఈ హత్యకు పాల్పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అమృత తన కడుపులో ఉన్న బిడ్డను ప్రణయ్‌లో చూసుకుంటానని చెప్తోంది. 

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)