నల్లగొండ: ప్రణయ్ హత్య కేసులో పోలీసులు కాంగ్రెసు నేత కరీంను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రణయ్ హత్య చేయించడానికి కరీం అమృత వర్షిణికి సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కరీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

డీల్‌ కుదిర్చిన మధ్యవర్తులను, వాహనాల డ్రైవర్లను శనివారం సాయంత్రానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారుతీరావు, శ్రవణ్‌కుమార్‌లపై ఐపీసీ 302, 120 (బీ), 109, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పి.శ్రీనివాస్‌ తెలిపారు. హంతక ముఠాను గాలించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, ఒకటి, రెండు రోజుల్లో అందరినీ అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

మారుతీరావు తన అల్లుడిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకున్నాడని, ఆ గ్యాంగ్‌ హత్యకు మూడు రోజుల ముందే పట్టణానికి చేరుకుందని, వారికి మారుతీరావే షెల్టర్‌ కల్పించారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తన కూతురు ఆస్పత్రికి వచ్చిన విషయాన్ని మారుతీరావు ఎప్పటికప్పుడు ఫోన్‌ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడని చెబుతున్నారు. 

మధ్యాహ్నం ప్రణయ్‌ హత్య జరిగే సమయానికి ప్రధాన నిందితుడు మారుతీరావు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద ఉన్నాడని, ఒక పనికోసం ఉన్నతాధికారులను కలిసేందుకు నల్లగొండకు వచ్చాడని సమాచారం. 

హత్య జరిగిన తర్వాత ఫోన్‌ రావడంతో ఆయన కలెక్టరేట్‌ నుంచి వెళ్లిపోయాడని, అయితే ఎటుపోవాలో పాలుపోక జాతీయ రహదారిపై చక్కర్లు కొట్టాడని, కేతేపల్లి, కట్టంగూరు తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు తెలుస్తోంది. 

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)