మిర్యాలగూడ:నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్ అనే యువకుడి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితులను పట్టుకొనేందుకు ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

6 మాసాల క్రితం మిర్యాలగూడ పట్టణానికి చెందిన  ప్రణయ్ అదే పట్టణానికి చెందిన తన క్లాస్‌మేట్ అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.  అమృతవర్షిణి, ప్రణయ్‌లది వేర్వేరు కులాలు.  దీంతో  ఈ పెళ్లికి అమృత వర్షిణి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

అమృతవర్షిణి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా  కూడ ప్రణయ్ అమెను పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి చేసుకొన్న తర్వాత తమకు రక్షణ కల్పించాలని కూడ ప్రణయ్ మిర్యాలగూడ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై అమృతవర్షిణి తండ్రి అమృతరావును  పోలీసులు హెచ్చరించారు.

అయితే మూడు మాసాల క్రితం ప్రణయ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.  కొంత కాలంగా  ప్రణయ్ కు  హెచ్చరికలు ఉన్నాయని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే  అమృతవర్షిణి కుటుంబసభ్యులే ప్రణయ్ ను హత్య చేయించారని ఆరోపిస్తున్నారు.

అమృతరావుతో పాటు ఆయన సోదరుడు కూడ ప్రస్తుతం అందుబాటులో లేడు.  వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కిరాయి హంతకుడి ద్వారా ఈ హత్య చేయించినట్టు  పోలీసులు అనుమానిస్తున్నారు. 

అయితే  అమృతరావు మాత్రం ఈ పెళ్లి ఇష్టంలేదని చెబుతున్నారు. కక్షకట్టి ప్రణయ్ ను హత్యచేసి ఉంటారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా ప్రణయ్  ను కొందరు వెంటాడుతున్నారని ఆయన అనుమానించాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

అయితే ప్రణయ్ పై దాడి జరిగిన సమయంలో అమృతవర్షిణి పక్కనే ఉంది. అమృత వర్షిణి భర్తపై దాడి జరుగుతుండగా భయంతో ఆసుపత్రిలోకి పరిగెత్తింది. ప్రస్తుతం ఆమె షాక్‌లో ఉందని వైద్యులు చెబుతున్నారు.భర్త చనిపోయిన విషయం మాత్రం ఆమెకు తెలియదన్నారు. 

                "

ఈ వార్త చదవండి

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)