మిర్యాలగూడ: మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావుకు నేర చరిత్ర ఉందని  పోలీసుల విచారణలో తేలింది.తన కూతురు ప్రేమ వివాహం చేసుకొంటే మారుతీరావు సహించలేకపోయాడు. అంతేకాదు తక్కువ కులానికి చెందిన ప్రణయ్ తన కూతురును  పెళ్లి చేసుకోవడంతో  ప్రణయ్ ను కిరాయి హంతకులతో హత్య చేయించాడు.

మిర్యాలగూడలో ప్రస్తుతం బడా బిల్డర్‌ గా మారుతీరావు పేరుపొందాడు. అయితే బడా బిల్డర్‌గా మారుతీరావు ఎదగడం వెనుక అనేక నయీం గ్యాంగ్‌తో  కలిసి సెటిల్ మెంట్లు చేయడం ... దళితుల భూములను ఆక్రమించుకోవడం వంటి వాటికి పాల్పడేవాడని తేలింది.

మిర్యాలగూడలో  కిరోసిన్ విక్రయించడంతో జీవితాన్ని ప్రారంభించిన మారుతీరావు అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. డబ్బుతో పాటు రాజకీయంగా పలుకుబడిని సంపాదించుకొన్న మారుతీరావు  ఆ తర్వాత తక్కువ కులానికి చెందిన ప్రణయ్ ను అమృతవర్షిణి చేసుకొందన్న కారణంగా  అతడిని చంపించివేశాడు.

భూ కబ్జాలు,  సెటిల్ మెంట్లు,  దందాలు చేయడం వంటిలో మారుతీరావు పేరు మోసాడు.  25 ఏళ్ల క్రితం మిర్యాలగూడలో  చిన్న స్కూటర్‌పై తిరిగే  మారుతీరావు ఆ తర్వాత కోట్లు సంపాదించాడు.

భూకబ్జాల్లో సుపారీ గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడేవారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పాటు మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పాగా వేసి తన పేరున మార్పిడి చేసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 20 ఏళ్ల క్రితం మిర్యాలగూడ తహసీల్దార్‌గా పనిచేసిన ఓ రిటైర్డ్‌ అధికారి అండ దండలతో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ఇటీవల మిర్యాలగూడ పట్టణ సమీపంలో 626 సర్వే నంబర్‌లో ఉన్న భూమిని ఆక్రమించుకున్నట్లుగా షెడ్యూల్డ్‌ కులాల వారు ఆందోళనలు నిర్వహించగా మారుతీరావు చేతిలో ఉన్న 20 కుంటల భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. అదే విధంగా సర్వే నంబర్‌ 716, 756 లలో కూడా ప్రభుత్వ భూములను బినామీల పేరుతో కబ్జాలు చేసినట్లు ఆరోపణలు కూడ ఉన్నాయి.

 అదేవిధంగా చింతపల్లిలో రోడ్డు పక్కన, అద్దంకి – నార్కట్‌పల్లి రోడ్డు వెంట మరికొంత భూమి ఉండగా దానిలో ఒక గది నిర్మించి సొంతం చేసుకున్నట్లు తెలి సింది. మిర్యాలగూడలోని కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్‌ ఏరియాలో మున్సిపాలిటీకి సంబంధించిన నాలుగు దుకాణాలు ఖాళీ చేయించి వెనుక వైపున ఉన్న తన ఖాళీ స్థలంలో సొంత భవనం నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఆయనకు మొదటి నుంచి కూడా అధికార పార్టీ అండదండలు ఉండేవి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయా నాయకులతో మంచి సంబంధాలను పెట్టుకునేవారు. ఎ లాంటి వివాదాలు వచ్చినా వారి అండదండలతో ఆస్తులు సంపాదించారు. 

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాడు. ఆయన దందాలకు పార్టీ పెద్దల అండదండలు ఉంటాయని భావించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో చేరడం ఆయన నైజం. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన తర్వాత ఇటీవల తనకంటూ ఒక వర్గం ఉండాలని కొంతమందిని కూడగట్టాడు.

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)