నల్గొండ: ప్రేమించి పెళ్లి చేసుకొన్న పాపానికి దారుణంగా హత్యలు చేసిన ఘటనలు నల్గొండ జిల్లాలో వరుసగా జరుగుతున్నాయి. గత ఏడాది ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరులో చోటు చేసుకొన్న నరేష్ ఉదతం... తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య. ఈ రెండు ఘటనల్లో కూడ అగ్రకులానికి చెందిన అమ్మాయిలను తక్కువ కులానికి చెందిన  అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఈ పెళ్లిళ్లు ఇష్టం లేని అమ్మాయిల కుటుంబసభ్యులు అబ్బాయిలను దారుణంగా హత్య చేశారు.

2017 మే 2వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పల్లెర్ల గ్రామంలో నరేష్ అనే  యువకుడిని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. తన కూతురును ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు నరేష్ ను శ్రీనివాస్ రెడ్డి చంపేశాడు. 

ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది.  అయితే నరేష్‌ భార్య స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి, బాబాయితో కలిసి స్వయంగా హత్య చేశాడు. నరేష్‌ను నమ్మించి తమ పొలం వద్దకు తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేశారు. మృతదేహం ఆనవాళ్లు కూడా లేకుండా కాల్చి బూడిద చేశారు. అంతేకాదు, తర్వాత స్వాతి కూడా పుట్టింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఇది కూడా పరువు హత్యే అన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
 


మొన్నటికి మొన్న హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘోరమే తీవ్ర కలకలం సృష్టించింది. కన్నతండ్రే కూతురిని ఇంటికి పిలిచి మరీ పరువు హత్యకు పాల్పడ్డాడు. అలా అని కూతురు కులాంతర వివాహం ఏమీ చేసుకోలేదు. 

తన కూతురు విజయలక్ష్మి బాబాయి వరుస అయిన సురేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపం పెంచుకొని అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన నర్సింహ నాలుగేళ్ల తర్వాత కూతురిని చేతులారా చంపేశాడు. మూడు నెలలక్రితం జరిగిందీ సంఘటన.
 
ఈ మూడు సంఘటనల్లోనూ మూడు ప్రాణాలు అన్యాయంగా బలయ్యాయి. కానీ పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్న వీళ్లకు అత్తారింట్లో అసలు సమస్య లేదు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో నరేష్‌ను హత్యచేసింది అతన్ని పెళ్లి చేసుకున్న స్వాతి తండ్రి, బాబాయి. హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌ మెట్‌లోనూ కన్నతండ్రే ఇంటికి వచ్చిన కూతురిని కడతేర్చాడు. ఇప్పుడు అమృత తండ్రి కూడా కూతురిని మనువాడిన వాడిని హత్య చేయించాడు.
 
తాను గర్భం దాల్చానని తెలిసినప్పటి నుంచి గర్భస్థ శిశువును చంపేయాలని తండ్రి మారుతీరావు వెంటపడుతున్నాడని అమృత చెబుతోంది. తండ్రి చెప్పిన మాట విననందుకే ప్రణయ్‌ను చంపించేశాడని కన్నీరుమున్నీరవుతోంది.


ప్రణయ్‌ హత్యకు ముందు తండ్రి తనకు ఫోన్‌ చేశాడని, అయితే.. ఆస్పత్రిలో ఉండటంతో ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదంటోంది అమృత. కానీ మరుసటి క్షణంలోనే ఘోరం జరిగిపోయిందని చెబుతోంది. ప్రణయ్‌ని హత్య చేసిన విషయాన్ని తన తండ్రికి ఫోన్‌ చేసి చెబితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని అంటోంది.
 

సాధారణంగా హత్యకేసులో ఎలాంటి శిక్ష వేస్తారో తన తండ్రికీ అదే శిక్ష పడాలంటోంది అమృత. ఏపాపం ఎరుగని ప్రణయ్‌నే వీళ్లు హత్యచేసినప్పుడు ఇంత పాపానికి ఒడిగట్టిన తన తండ్రిని మాత్రం వదిలేయొద్దంటోంది. తాను బిడ్డను కని ఆ బిడ్డలో ప్రణయ్‌ను చూసుకుంటానని తెలిపింది.
 

ఈ వార్తలు చడవండి
'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

 

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో