మిర్యాలగుడా: ప్రణయ్ హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణయ్ హత్యలో ఆరు నుంచి ఎనిమిది ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రణయ్ భార్య అమృతవర్షిణి తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ లతో పాటు సుపారీ తీసుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రణయ్ పై గతంలో కూడా రెండుసార్లు హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు సార్లు కూడా వేర్వేరు ముఠాలు హత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ రెండు ముఠాల్లో ఒకటి స్థానికమైంది కాగా, రెండోది జిల్లా స్థాయి ముఠా అని తెలుస్తోంది.

ఈ రెండు హత్యాయత్నాలు విఫలం కావడంతో సుపారీ ఇచ్చి కాకలు తీరిన ముఠాను నియోగించుకున్నట్లు తెలుస్తోంది. ప్రణయ్ హత్యకు సంబంధించి మొత్తం డీల్ కోటి రూపాయలకు పైగానే ఉందని అనుమానిస్తున్నారు. 

సుపారీ గ్యాంగ్ కు మారుతీ రావు అడ్వాన్స్ గా ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రణయ్ ఇంటి వద్ద చాలా కాలంగా హంతకులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. అనుమానం కారణంగానే ప్రణయ్ తన ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ వార్తాకథనాలు చదవండి

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)