మిర్యాలగూడ:ప్రణయ్ కారణంగా వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలని తన తండ్రి తనమీద ఒత్తిడి తెచ్చాడని అమృతవర్షిణీ చెప్పారు. తాను ట్రీట్ మెంట్ చేయించుకొనే ఆసుపత్రి డాక్టర్ కు ఫోన్ చేసి తాను అబార్షన్ చేయించుకొనేలా ఒప్పించాలని  కూడ కోరినట్టు ఆమె తెలిపారు.

తాను గర్భం దాల్చిన విషయం తన తండ్రి మారుతీరావుకు చెబితే ఆ విషయాన్ని తన తల్లికి చెప్పకూడదని చాలా కాలం ఒత్తిడి తెచ్చాడని అమృతవర్షిణీ చెప్పారు. అయితే కొంత కాలం తర్వాత తాను ఈ విషయాన్ని తన తల్లికి చెప్పినట్టు అమె గుర్తుకు చేసుకొన్నారు.

ప్రణయ్ ఇంట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ పెళ్లికి ఒప్పుకోలేదన్నారు. అయితే తాను  గర్భం దాల్చిన విషయాన్ని నాన్నకు ఫోన్ చేసి చెబితే  ఈ విషయాన్ని అమ్మకు చెప్పొదన్నాడన్నారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఆమె బాధపడుతోందని తనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు.

అయితే  ఈ గర్భాన్ని తొలగించుకోవాలని తాను ఎప్పుడూ ఫోన్ చేసినా  కూడ  చెప్పేవాడన్నారు.  తాను  జ్యోతి ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న విషయం తెలుసుకొని డాక్టర్ జ్యోతికి కూడ ఫోన్ చేసి  అబార్షన్ చేసుకొనేలా తనను ఒప్పించాలని  డాక్టర్ జ్యోతికి ఫోన్ చేసి చెప్పారని  అమృతవర్షిణీ చెప్పారు.

అయితే ఏ రోజు ఎప్పుడూ నాన్న ఫోన్ చేసి ఏం చెప్పాడు... అబార్షన్ చేసుకొనేలా తనను ఎలా ఒప్పించాలో డాక్టర్ జ్యోతి తనకు చెప్పారని అమృత వర్షిణీ చెప్పారు. అయితే  తాను మాత్రం అబార్షన్ చేసుకొనేందుకు ఒప్పుకోలేదన్నారు.

ఇదిలా ఉంటే  తాను గర్భం దాల్చిన విషయాన్ని కొంతకాలానికి  తన తల్లికి చెప్పినట్టు ఆమె చెప్పారు. ప్రణయ్ హత్యకు ముందు కూడ డాక్టర్ జ్యోతికి తన తండ్రి ఫోన్ చేసి ట్రీట్ కోసం వచ్చారా.. ఏమన్నారనే విషయాన్ని కూడ అమృతవర్షిణీ చెప్పారు. 

ఈ వార్తలు చదవండి

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)