మిర్యాలగూడ:నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ ను గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

ఈ ఘటన మిర్యాలగూడలో సంచలనం సృష్టించింది.మిర్యాలగూడలోని బాలాజీనగర్ లో ప్రణయ్ నివాసం ఉంటున్నాడు. ప్రణయ్ ఆరు మాసాల క్రితం అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.

అమృతవర్షిణి ప్రస్తుతం మూడు మాసాల గర్భిణీ.అమృత వర్షిణీని ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఈ ప్రేమ వివాహం సందర్భంగా అమ్మాయి తరపు కుటుంబసభ్యులు గొడవ చేశారు. అయితే ప్రస్తుతం ప్రణయ్  తన భార్య అమృతవర్షిణితో కలిసి బాలాజీనగర్ లో నివాసం ఉంటున్నాడు.

అమృతవర్షిణి తండ్రి పెద్ద బిల్డర్. ప్రణయ్ ది సాధారణ కుటుంబం. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రణయ్ తన భార్య అమృత వర్షిణీని జ్యోతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో భార్యకు చెకప్ చేయించుకొని తిరిగి వస్తుండగా ఆసుపత్రి వద్దనే  ఉన్న ఓ వ్యక్తి కత్తితో ప్రణయ్ ను వెనక నుండి దాడికి పాల్పడ్డాడు.

 ప్రణయ్ చనిపోయాడని భావించిన తర్వాత ఆ నిందితుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ దాడి జరిగిన వెంటనే భార్య అమృతవర్షిణి భయంతో ఆసుపత్రిలోకి పరుగెత్తింది.ఈ హత్యకు అమృ వర్షిణీ కుుటుంబంపై ప్రణయ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రేమ వివాహం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి సమయంలోనే అమ్మాయి తరపు కుటుంబసభ్యులు వ్యతిరేకించడాన్ని ప్రణయ్ కుటుంబసభ్యులు గుర్తు చేస్తున్నారు.

ప్రణయ్, అమృతవర్షిణీలవి వేర్వేరు కులాలు. దీంతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన స్థలాన్ని ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు.

                      "