మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రణయ్ ను ప్రేమ వివాహం బలితీసుకొంది.  తన క్లాస్ మేట్  అమృత వర్షిణిని ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.

ఆరు మాసాల క్రితం అమృత వర్షిణిని ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. అయితే ఈ పెళ్లి సమయంలోనే ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవలు జరిగాయి.అయితే కొంత కాలం పాటు ప్రణయ్ మిర్యాలగూడకు దూరంగా ఉన్నాడు. ఇతర ప్రాంతాల్లో ఉండడం కంటే మిర్యాలగూడలోనే ఉండడం సేఫ్ అని ప్రణయ్ భావించాడు.

అమృతవర్షిణిది అగ్రకులం. ప్రణయ్ ది నిమ్నకులం. వేర్వేరు కులాలు కావడంతోనే  అమృతవర్షిణి తండ్రి మారుతీరావు మిర్యాలగూడలో పెద్ద బిల్డర్.  అయితే ఈ పెళ్లి ఆయనకు ఇష్టం లేదని ప్రణయ్ కుటుంబసభ్యులు చెబుతున్నారు.


అమృతవర్షిణి, ప్రణయ్‌లు క్లాస్‌మేట్స్. 9వ, తరగతి నుండి ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకొన్నారు.  ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.వీరిద్దరూ కూడ బీటెక్ చదివారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొన్నారు.  అమృతవర్షిణి తండ్రి మాత్రం ఈ పెళ్లికి అంగీకరించలేదు. 

అయితే ఇటీవల అమృతవర్షిణితో  అతని తండ్రి మారుతీరావు మాట్లాడడం ప్రారంభించారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే అమృతవర్షిణితో తండ్రి మాటలు కలిపాడా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్ కు  ప్రాణభయం ఉందని తల్లిదండ్రులు  పోలీసు ఉన్నతాధికారులను కూడ ఆశ్రయించినట్టు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే  ప్రణయ్‌ను కిరాయి హంతకులతో హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిరాయి హంతకుడికి రూ.10లక్షలు సుఫరీ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మారుతీరావును ఏ 1గా, మారుతీరావు సోదరుడు శ్రవణ్ ను ఏ 2 పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)