తానే తన కూతురి భర్త ప్రణయ్ ని హత్య చేయించానని అమృత తండ్రి మారుతీరావు అంగీకరించారు. శుక్రవారం మిర్యాలగూడలో పట్టపగలు నడిరోడ్డుపై ప్రణయ్ అనే యువకుడిని ఓ వ్యక్తి కత్తితో నరికి చంపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ హత్య ప్రణయ్ మామ మారుతీరావు చేయించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ హత్య జరగడానికి అరగంట ముందే మారుతీరావు మిర్యాలగూడ నుంచి పరారయ్యాడు. కాగా శనివారం ఉదయం పోలీసులు నిందితుడు మారుతీరావుని అదుపులోకి తీసుకున్నారు. హత్య గురించి విచారించగా.. తానే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. ప్రణయ్ అంటే నచ్చకే తాను ఈ హత్య చేయించినట్లు మారుతీరావు తెలిపాడు. 

తమ ఇష్టానికి వ్యతిరేఖంగా కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమకు ఏ మాత్రం నచ్చలేదని ప్రణయ్ ను చంపడానికి 10 లక్షలతో డీల్ కుదుర్చుకొని హతమార్చినట్లు అంగీకరించారు.

read more news

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)