Asianet News TeluguAsianet News Telugu

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

తన కూతరు అమృత భర్త ప్రణయ్ హత్యకు ఓ మాజీ ఉగ్రవాదితో మారుతీరావు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మాజీ ఉగ్రవాది ఓ భూవివాదంలో మారుతీరావును గతంలో కిడ్నాప్ చెసినట్లు తెలుస్తోంది. అతనికి కోటి రూపాయల సుపారీ ఇచ్చినట్లు సమాచారం.

Former terrorist was used to kill Pranay
Author
Nalgonda, First Published Sep 16, 2018, 9:54 AM IST

నల్లగొండ: తన కూతరు అమృత భర్త ప్రణయ్ హత్యకు ఓ మాజీ ఉగ్రవాదితో మారుతీరావు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మాజీ ఉగ్రవాది ఓ భూవివాదంలో మారుతీరావును గతంలో కిడ్నాప్ చెసినట్లు తెలుస్తోంది. అతనికి కోటి రూపాయల సుపారీ ఇచ్చినట్లు సమాచారం.

చివరి నిమిషం వరకు కూతురితో మంచిగా మాట్లాడుతూనే ప్రణయ్ ఆచూకీని హంతకులకు మారుతీ రావు చేరవేస్తూ వచ్చాడని అంటున్నారు. అదే విధంగా మారుతీ రావు భార్య కూతురు అమృతతో మాట్లాడుతూ ఉండేది. మంచీచెడులు కనుక్కోవడానికి ఆమె అమృతతో మాట్లాడేది. అయితే, సమాచారం తెలుసుకుని, భర్తకు చేరవేస్తూ వచ్చేదేమోనని అమృత అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
 
తండ్రి మారుతీరావు, బాబాయ్ పలుమార్లు బెదిరిస్తుండడంతో ప్రణయ్‌, వర్షిణి మిర్యాలగూడకు దూరంగా వెళ్లాలని అనుకున్నారు. కానీ, అమృతకి టైఫాయిడ్‌ రావడంతో అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో అమృత గర్భం దాల్చింది. దాంతో ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఆగస్టులో మిర్యాలగూడలోని ఫంక్షన్‌ హాల్‌లో భారీ రిసెప్షన్‌ ఇచ్చారు. 
పట్టణానికి చెందిన పెద్దలు హాజరయ్యారు. వెడ్డింగ్‌ షూట్‌, రిసెప్షన్‌లో ప్రణయ్‌, అమృత దిగిన ఫొటోలు, వీడియోలు పట్టణంలో వైరల్‌ అయ్యాయి. దాంతో ప్రణయ్‌ని హత్య చేయాలనే నిర్ణయానికి మారుతీరావు వచ్చాడు. 

రాజకీయ పలుకుబడితో పోలీసులపై ఒత్తిడి పెంచి మారుతీ రావు ప్రణయ్, అమృత దంపతులను విడదీసేందుకు ప్రయత్నించాడు. మారుతీరావు బెదిరింపులతో ప్రణయ్‌ దంపతులు రక్షణ కోసం హైదరాబాద్‌లోని పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దాంతో మారుతీరావుకు మిర్యాలగూడ డీఎస్పీ, ఎస్పీ రంగనాథ్‌ గట్టిగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు.
 
ఎస్పీ కౌన్సెలింగ్‌ తర్వాత వర్షిణితో మంచిగా ఉన్నట్టు మారుతీరావు నటిస్తూ ఫోన్ లో మాట్లాడుతూ వచ్చాడు. అదే సమయంలో మిర్యాలగూడలో పీడీ యాక్ట్‌ కింద అరెస్టైన ఓ వ్యక్తితోపాటు నల్లగొండలోని రౌడీ షీటర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రయత్నం విఫలమైంది. 

దాంతో ప్రణయ్‌ హత్యకు భారీ మొత్తం ఇస్తానని నల్లగొండకు చెందిన కిరాయి హంతకుడితో ఒప్పందం చేసుకున్నాడు. అతడు మిర్యాలగూడలో రెక్కీ నిర్వహించాడు. విషయం తెలియడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దాంతో రెండో ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. 

దాంతో మారుతీరావు మూడో ప్రయత్నంలో మాజీ ఉగ్రవాదిని సంప్రదించినట్టు తెలిసింది. భూ వివాదంలో గతంలో అతడు మారుతీరావును కిడ్నాప్‌ చేశాడు. ఆ కేసు కోర్టులో నడుస్తోంది. తనను కిడ్నాప్‌ చేసిన మాజీ ఉగ్రవాదితోనే కోటి రూపాయలకు సుపారీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
 
మాజీ ఉగ్రవాదితో హైదరాబాద్‌లో డీల్‌ కుదుర్చుకున్న మారుతీరావు మిర్యాలగూడకు వెళ్లి మధ్యవర్తి ద్వారా నగదును చేరవేసినట్లు తెలుస్తోంది. ఆ మాజీ ఉగ్రవాది హంతక ముఠాను మిర్యాలగూడకు పంపినట్లు తెలుస్తోంది. ప్రణయ్‌ను హతమార్చిన గ్యాంగ్‌ హత్య ఘటనలో పాల్గొన్న వ్యక్తి బైక్‌పై ప్రణయ్‌ను అనుసరించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. 

హత్య జరిగిన విషయాన్ని మారుతీరావు అమృత ద్వారానే తెలుసుకున్నాడు. వెంటనే మారుతీరావు తన ఫార్చ్యూనర్‌ (ఏపీ24 ఏజడ్‌ 1111) కారును నల్లగొండలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద వదిలి మరో కారులో హైదరాబాద్‌ వెళ్లాడు.
 
తన కుటుంబ సభ్యులను, తమ్ముడు శ్రవణ్‌ కుటుంబ సభ్యులను వేరే ప్రాంతాలకు తరలించాడు. ఎస్పీ రంగనాథ్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా హత్య జరిగిన రోజు రాత్రే మారుతీరావు, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios