హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నెల రోజుల పాటు  బిజీ బిజీగా  గడపనున్నారు.  తొలి విడతగా  జనవరి 1వ తేదీ వరకు కేసీఆర్ పలు ,ప్రాంతీయ పార్టీలతో  చర్చించనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను కేసీఆర్  వివరించనున్నారు.  ఈ నెల 23వ తేదీ నుండి కేసీఆర్ పలు రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ నెల 23వ తేదీన ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట నుండి కేసీఆర్  తొలుత ఏపీ రాష్ట్రంలోని విశాఖ చేరుకొంటారు. విశాఖలో  స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకొంటారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత కేసీఆర్  ఒడిశా  రాష్ట్రానికి వెళ్తారు. కేసీఆర్  కుటుంబసభ్యులు విశాఖ నుండి హైద్రాబాద్‌కు తిరిగి వస్తారు.

విశాఖ నుండి కేసీఆర్  ఒడిశాకు చేరుకొంటారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఆయన చర్చించనున్నారు. అదే  రోజుల సీఎం  అధికారిక నివాసంలో  ఆయన బస చేస్తారు.  ఈ నెల 24 వ తేదీన రొడ్డు మార్గంలో కోణార్క్  దేవాలయాన్ని  కేసీఆర్ సందర్శిస్తారు.అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి భువనేశ్వర్ చేరుకొంటారు.

భువనేశ్వర్ నుండి  కేసీఆర్ కోల్‌కత్తా చేరుకొంటారు కోల్‌కత్తాలో  బెంగాల్ సీఎం మమత బెనర్జీని  కలుసుకొంటారు. ఆమెతో గతంలో కూడ కేసీఆర్  సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించారు. కో‌ల్‌కతాలోని దుర్గామాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అదే రోజు రాత్రి  ఢిల్లీకి చేరుకొంటారు.

ఢిల్లీలో మాయావతితో పాటు పలు పార్టీల నేతలను  కేసీఆర్ కలుసుకొంటారు. ప్రధానమంత్రి మోడీని కూడ కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో కూడ కేసీఆర్ సమావేశం కానున్నారు.  ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కూడ కేసీఆర్ సమావేశం కానున్నారు.

బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇతర పార్టీలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడగడుతున్నారు. ఈ తరుణంలో ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటు విషయమై కేసీఆర్ మరోసారి తన కార్యాచరణను వేగవంతం చేశారు. ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటు విషయమై కేసీఆర్ గతంలో  కలిసిన పార్టీల నేతలను బాబు కూడగడుతున్నారు. ఈ తరుణంలో మరోసారి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్  పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకేనని బాబు విమర్శలు చేశారు.ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంటూ  హడావుడి చేస్తున్నారని చంద్రబాబు నాయుడు  విమర్శలు చేస్తున్నారు.ఇప్పటికే బాబు కూడగట్టిన పార్టీలు మరోవైపు కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్‌ వైపు వెళ్తే బాబుకు రాజకీయంగా దెబ్బతగిలే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కాంగ్రెస్,బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో పాటు కలిసొచ్చే పార్టీలతో కేసీఆర్ చర్చించనున్నారు.  ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాను ఆయా పార్టీల నేతలతో చర్చించే అవకాశం ఉంది.  నెల రోజుల పాటు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై కేసీఆర్ పలు పార్టీలతో చర్చించనున్నారు. 

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి‌పై ఓవైసీ, కేసీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

రేవంత్‌రెడ్డికి చెక్: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు

రేవంత్‌కు కొడంగల్ దెబ్బ: కేసీఆర్ పంతం, హరీష్ వ్యూహం

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లెలా ఉన్నాయి: రేవంత్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్