Asianet News TeluguAsianet News Telugu

ప్రణయ్ కుటుంబానికి మారుతీ రావు షరతులు ఇవీ...

ప్రణయ్, తన కూతురు అమృత వర్షిణిలను విడదీయడానికి అమృత రావు పెద్ద స్కెచ్ వేశాడు. ఏడాది కిందట ప్రణయ్ కుటుంబానికి ఆయన కోటిన్నర రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Maruthi Rao orders pranay family to leave Miryalaguda
Author
Miryalaguda, First Published Sep 18, 2018, 8:35 AM IST

మిర్యాలగూడ: ప్రణయ్, తన కూతురు అమృత వర్షిణిలను విడదీయడానికి అమృత రావు పెద్ద స్కెచ్ వేశాడు. ఏడాది కిందట ప్రణయ్ కుటుంబానికి ఆయన కోటిన్నర రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నేత కరీం, మరికొందరు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రణయ్‌ కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఒత్తిడి పెట్టాడు. అమృతను శాశ్వతంగా మరిచిపోవడంతోపాటు ప్రణయ్‌ కుటుంబ సభ్యులు వారి సెల్‌ఫోన్‌ సిమ్‌లన్నీ ఇచ్చేసి కొత్త నంబర్లు తీసుకోవాలని అతను షరతు పెట్టినట్లు తెలుస్తోంది. 

ప్రణయ్‌ కుటుంబం మిర్యాలగూడ విడిచి వెళ్లిపోవాలని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఎల్‌ఐసీలో డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న ప్రణయ్‌ తండ్రి బాలస్వామిని వేరే శాఖకు బదిలీ చేయించే బాధ్యతను కూడా తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. 

రాజకీయంగా తీవ్ర ఒత్తిడి తేవడంతో ప్రణయ్ కుటుంబం అంగీకరించిట్లు చెబుతున్నారు. వారు తమ సిమ్‌లను కూడా మారుతీరావుకు ఇచ్చేశారని ప్రణయ్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. అయితే, మారుతీరావు ఒప్పందం ప్రకారం ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని తెలుస్తోంది.

 మరోవైపు, ఒత్తిడితో కుటుంబ సభ్యులు అంగీకరించినా, ప్రణయ్‌ అంగీకరించలేదని చెబుతున్నారు. తన ప్రేమను మరిచిపోలేనని,  అమృతతోనే తన జీవితమని చెప్పడంతో కథ ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఐదారు నెలలకు ప్రణయ్‌ అమృతను హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌ మందిరంలో పెళ్లి చేసుకున్నాడు.
 
ఆ తర్వాత కూడా ప్రణయ్‌ కుటుంబంపై మారుతీరావు రాజకీయంగా ఒత్తిడి పెడుతూనే వచ్చాడని అంటున్నారు. తన తండ్రి ఏదో ఒక రోజు తమను అంగీకరిస్తాడని అమృత చెప్పడంతో హైదరాబాద్‌ నుంచి కాపురాన్ని మిర్యాలగూడకు మార్చారు. 

ఈ ఏడాది ఆగస్టులో అమృత కోరిక మేరకే ఆమె అత్తమామలు రూ.15 లక్షల వరకూ ఖర్చు చేసి రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు. ప్రణయ్‌ మిత్రుడు ఒకతను వీడియో ఆల్బమ్‌ను సినిమా పాట తరహాలో రూపొందించి ఇచ్చాడు. దాన్ని అమృత ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల్లో అప్‌లోడ్‌ చేయడంతో 30 వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. దాంతో మారుతీరావు మరింత పగ పెంచుకుని అమృతను హెచ్చరించినట్లు చెబుతున్నారు.
 
మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టాలని ఎస్పీ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. రియల్టర్‌, బిల్డర్‌ మారుతీరావు ఆర్థిక మూలాలపై పోలీసు శాఖ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్పీ ఏవీ రంగనాథ్‌, కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌తో చర్చించినట్టు సమాచారం. 

మిర్యాలగూడ శివారుతోపాటు గూడూరు, ఈదులగూడ, నందిపాడు, వెంకటాద్రిపాలెం శివార్లలోని ప్రభుత్వ భూముల వివరాలు, అవి ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉన్నాయనే విషయాలను, అసైన్డ్‌ కమిటీ సిఫారసుల వివరాలను రెవెన్యూ, పోలీస్‌ శాఖలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వ భూముల కబ్జాను వదిలేసి ఓ మాజీ మంత్రి బంధువులతో కలిసి మిర్యాలగూడలో రెండు సినిమా థియేటర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది అక్కడ మల్టీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాన్ని చేపట్టాడు. బస్టాండ్‌ సమీపంలో పాత నటరాజ్‌ థియేటర్‌ ప్రదేశంలో రూ.40 కోట్ల వ్యయంతో ఐదంతస్తుల షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాడు. 

అలాగే, అద్దంకి-నార్కట్‌పల్లి బైపాస్‌ రోడ్డు సమీపంలో, మిర్యాలగూడ రెవెన్యూ శివారులో, నందిపాడు సమీపంలో 20 ఎకరాల్లో శరణ్య గ్రీన్‌హోమ్స్‌ పేరుతో మారుతీరావు ఇండిపెండెంట్‌ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios