ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: దిక్కుతోచని స్థితిలో సీపీఐ
కాంగ్రెస్ ఇస్తానని ప్రకటించిన సీట్ల విషయంలో ఏం చేయాలనే విషయమై సీపీఐ మల్లగుల్లాలు పడుతోంది.
హైదరాబాద్: కాంగ్రెస్ ఇస్తానని ప్రకటించిన సీట్ల విషయంలో ఏం చేయాలనే విషయమై సీపీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఏం చేయాలో తేల్చుకోలేక సీపీఐ రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం మధ్యాహ్నాం అర్ధాంతరంగా వాయిదా వేసింది. శుక్రవారం సాయంత్రం మరోసారి సీపీఐ రాష్ట్ర కార్గవర్గం భేటీ కానుంది.
ప్రజా కూటమి (మహా కూటమి)లో సీట్ల సర్దుబాటు వ్యవహరం ఇంకా తేలలేదు. కాంగ్రెస్ మిత్రపక్షాలకు కేటాయించే సీట్ల సంఖ్యను ప్రకటించినా కూడ సర్దుబాటు వ్యవహరం ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ పార్టీ 94 సీట్లలో పోటీ చేయనుంది.సీపీఐకు 3, టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క సీటును కేటాయించింది.
సీపీఐకు మూడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది.శుక్రవారం నాడు జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు విషయమై వాడీ వేడీ చర్చ సాగింది. ఇప్పటికే తాము పోటీ చేసే 9 స్థానాలను కూడ సీపీఐ ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ మూడు ఎమ్మెల్యే సీట్లు, 2 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని ప్రకటించింది. కనీసం 4 ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీసీటు ఇవ్వాలని కూడ సీపీఐ ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ ప్రతిపాదించింది.
కానీ కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలంగా స్పందన లేకపోయింది.ఈ తరుణంలో శుక్రవారం నాడు అత్యవసరంగా రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని సీపీఐ నిర్వహించింది.
ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీజేఎస్‌కు 8 సీట్లు ఇచ్చి తమకు కేవలం 3 సీట్లే ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి,వైరా,దేవరకొండ స్థానాలను సీపీఐ కోరుతోంది. కూటమిలోని ఇతర పార్టీలతో చర్చించాలని నిర్ణయం తీసుకొన్నారు.టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ చీప్ కోదండరామ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుబాటులో లేనందున మాజీ మంత్రి జానారెడ్డిని కలవాలని సీపీఐ నిర్ణయం తీసుకొంది.
సీపీఐ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులంతా మూకుమ్మడిగా ఈ నేతలను కలవనున్నారు. తమ డిమాండ్లను కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు వివరించనున్నారు.కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలనే దానిపై సాయంత్రం ఆరు గంటలకు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.
సంబంధిత వార్తలు
కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....
ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ
సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్
టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?